Site icon NTV Telugu

Bhagwanth Singh Mann : నేడు మల్లన్న సాగర్‌కు పంజాబ్‌ సీఎం

Bhagwant Mann

Bhagwant Mann

నేడు సిద్దిపేట జిల్లాలో పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్ పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు రోడ్డు మార్గాన హైదరాబాద్ నుంచి గజ్వేల్ కి బయలుదేరానున్న సీఎం భగవంత్‌ సింగ్‌.. ఉదయం 11 గంటలకు కొండపోచమ్మ రిజర్వాయర్ ని, మల్లన్నసాగర్‌, 11.30 గంటలకు మర్కుక్ పంప్ హౌస్, పాండవుల చెరువును పరిశీలించనున్నారు. పంజాబ్ సీఎంతో కలిసి సీఎం కేసీఆర్ కూడా సిద్దిపేట జిల్లాలో పర్యటిస్తారని సమాచారం. కాళేశ్వరం ప్రాజెక్టు, భూగర్భ జలాల పెరుగుదల, మిషన్ కాకతీయ గురించి పంజాబ్ సీఎం బృందానికి తెలియజేయడం ఈ పర్యటన ముఖ్య ఉద్దేశం. మధ్యాహ్నం పర్యటన ముగించుకుని తిరిగి హైదరాబాద్ బయలుదేరానున్నారు పంజాబ్ సీఎం.

Also Read : Bandi Sanjay : మోడీ అలా చేస్తే.. బీఆర్ఎస్ లో ఒక్కరైనా మిగిలేవారా?

ఈ సందర్భంగా.. రాష్ట్రంలో భూగర్భ జలాల పరిరక్షణకు గత కొన్నేళ్లుగా చేపట్టిన చర్యలను పంజాబ్ సీఎం, ఆయన బృందం పరిశీలించనుంది. మిషన్ కాకతీయ కింద చెరువుల పునరుద్ధరణ, చెక్ డ్యాంల నిర్మాణం తదితరాలు, వాటి ఫలితాలను క్షేత్రస్థాయిలో ఈ బృందంలోని అధికారులు అధ్యయనం చేయనున్నారు. పంజాబ్‌లో భూగర్భ జలాల కొరత ఉన్న నేపథ్యంలో రాష్ట్రంలో భూగర్భ జలాల పరిరక్షణ కోసం తీసుకున్న చర్యలను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్, అధికారులు స్వయంగా పరిశీలించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నీటిపారుదల ప్రాజెక్టుల్లో కొన్నింటిని పరిశీలించే అవకాశం ఉంది.

Also Read : Sri Shirdi Sai Chalisa: నేడు భక్తిశ్రద్ధలతో సాయి చాలీసా వింటే పాపభారం తగ్గిపోతుంది

Exit mobile version