Godavari Water Level at 49 Feet at Bhadrachalam: భద్రాచలం గోదావరి నీటిమట్టం తగ్గుదల ప్రారంభమైంది. గురువారం రాత్రి నుంచి స్వల్పంగా గోదావరి తగ్గుతుంది. ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 49 అడుగులకు చేరుకుంది. రెండవ ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. 48 అడుగులు దాటితే రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారన్న విషయం తెలిసిందే. గోదావరి నీటిమట్టం పెరగడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దుమ్ముగూడెం, చర్ల, వాజేడు, వెంకటాపురం మండలాలకు రాకపోకలు స్తంభించాయి. మరోవైపు గోదావరి దిగువన ఉన్న ముంపు మండలాలకు కూడా రాకపోకలు నిలిచిపోయాయి.
ఎగువ నుంచి కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్ జిల్లాలో కురిసిన భారీ వర్షాల వల్ల భద్రాచలం వద్ద గోదావరికి నీటిమట్టం భారీగా పెరిగింది. నిన్న రాత్రి వరకు భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 52 అడుగులకు చేరుకుంది. మరొక అడుగు పెరిగితే 53 అడుగులకు చేరేది, అప్పుడు మూడవ ప్రమాద హెచ్చరిక జారీ చేయాల్సిన అవసరం ఏర్పడేది. కానీ గోదావరి పరివాహక ప్రాంతంలో వర్షాలు లేకపోవడం వరద తీవ్రత తగ్గటంతో భద్రాచలం వద్ద కూడా గోదావరి నీటిమట్టం తగ్గటం ప్రారంభమైంది.
Also Read: Telangana Bandh: ‘మార్వాడీ గో బ్యాక్’ ఉద్యమం.. నేడు తెలంగాణ బంద్!
గురువారం ఉదయం నుంచి పేరూరు వద్ద గోదావరి నీటిమట్టం తగ్గటం ప్రారంభమైంది. భద్రాచలం వద్ద మాత్రం గత రాత్రి పది గంటల నుంచి గోదావరి వరద తీవ్రత తగ్గటం ప్రారంభమైంది. ప్రస్తుతం 49 అడుగులు గోదావరి ఉండగా.. మరొక అడుగు తగ్గితే రెండవ ప్రమాద హెచ్చరిక ఉపసంహరిస్తారు. ప్రస్తుతమైతే మొదటి ప్రమాద, రెండవ ప్రమాద హెచ్చరికలు కొనసాగుతున్నాయి. మరో 2-3 రోజులు పెద్దగా వర్షాలు లేవని సమాచారం.
