NTV Telugu Site icon

Vishnupriya : విష్ణుప్రియకు హైకోర్టులో స్వల్ప ఊరట..!

Vishnupriya

Vishnupriya

Vishnupriya : బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్‌కు సంబంధించి ప్రముఖ సినీ తారలు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఈ వ్యవహారంలో పంజాగుట్ట, మియాపూర్ పోలీసులు మొత్తం 11 మంది సెలబ్రిటీలపై కేసులు నమోదు చేసి, వారికి నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో నటి విష్ణుప్రియ ఈ నెల 20న పంజాగుట్ట పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. అయితే, తనపై నమోదైన రెండు ఎఫ్ఐఆర్‌లను రద్దు చేయాలని హైకోర్టును ఆశ్రయించారు. తనపై నమోదైన కేసుల్లో న్యాయం చేయాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

విష్ణుప్రియ పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు, ఎఫ్‌ఐఆర్ రద్దు చేయడాన్ని లేదా దర్యాప్తుపై స్టే (Stay) విధించడం పై అంగీకారం తెలియజేయలేదు. పోలీసులకు సహకరించాల్సిందే అనే స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు తన ఉత్తర్వుల్లో 35(3) బిఎన్ఎస్ఎస్ నిబంధనలు పాటించాలని స్పష్టం చేసింది. అంతేకాకుండా, విష్ణుప్రియను అరెస్ట్ చేయొద్దని పోలీసులను ఆదేశించింది. అయితే, విచారణలో పోలీసులకు సహకరించాల్సిందే అని కోర్టు స్పష్టం చేసింది.

ఈ కేసులో మరో కీలక పరిణామంగా మియాపూర్, పంజాగుట్ట ప్రాంతాల్లో నమోదైన రెండు కేసులను క్లబ్ చేయాలని హైకోర్టు సూచించింది. ఈ నేపథ్యంలో, పోలీసులు విచారణను మరింత వేగవంతం చేసేందుకు సిద్ధమవుతున్నారు.

Vijay: విజయ్‌ పార్టీ కీలక తీర్మానం.. సీఎం స్టాలిన్ టార్గెట్‌గా విజయ్ సంచలన వ్యాఖ్యలు