NTV Telugu Site icon

Duleep Trophy 2024: హర్షిత్ రాణా.. ఈ ఎక్స్‌ట్రాలే తగ్గించుకుంటే మంచిది!

Harshit Rana Flying Kiss

Harshit Rana Flying Kiss

Harshit Rana Flying Kiss Celebrations: హర్షిత్ రాణా.. ఈ పేరు గురించి క్రికెట్ అభిమానులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కోల్‌కతా నైట్‌ రైడర్స్ (కేకేఆర్) తరఫున ఆడుతున్న హర్షిత్.. ఐపీఎల్‌ 17వ సీజన్‌లో రాణించాడు. అయితే ఫ్లయింగ్ కిస్ సెలెబ్రేషన్స్‌ కారణంగా అతడు ఐపీఎల్ నిర్వాహకుల ఆగ్రహానికి గురయ్యాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌ ఓపెనర్ మయాంక్‌ అగర్వాల్‌ పెవిలియన్‌కు వెళ్తున్న సమయంలో.. అతడికే ప్లైయింగ్‌ కిస్‌ ఇచ్చి సెండాఫ్ పలికాడు. హెన్రిచ్ క్లాసెన్ విషయంలోనూ ప్రవర్తనానియమావళిని ఉల్లంఘించాడు. దాంతో ఐపీఎల్ నిర్వాహకులు మందలింపుతో పాటు మ్యాచ్ ఫీజులో 60 శాతం కోత విధిస్తూ జరిమానా విధించారు.

భారీ జరిమానా పడినా హర్షిత్ రాణా మారలేదు. ప్రతిష్టాత్మక దేశవాళీ క్రికెట్ టోర్నీ దులీప్‌ ట్రోఫీ 2024లోనూ అదే తరహా సెలెబ్రేషన్స్‌తో ప్రత్యర్థి బ్యాటర్‌ను కవ్వించాడు. దులీప్ ట్రోఫీ 2024లో ఇండియా-డీకి ప్రాతినిథ్యం వహిస్తున్న హర్షిత్.. అనంతపురం వేదికగా ఇండియా సీతో జరుగుతున్న మ్యాచ్‌లో(2/13) సత్తా చాటాడు. ఇన్నింగ్స్ ఆరంభంలోనే ఇండియా-సీ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (5)ను అవుట్ చేసిన హర్షిత్.. అతడేకే ఫ్లయింగ్ కిస్ ఇస్తూ సెలెబ్రేషన్స్‌ చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన నెట్టింట వైరల్‌గా మారింది.

Also Read: Paralympics 2024 India: పారాలింపిక్స్‌లో నేటి భారత్ షెడ్యూల్ ఇదే!

ఓపెనర్ సాయి సుదర్శన్‌ (7) వికెట్ అనంతరం కూడా గాల్లోకి పంచ్‌లు ఇస్తూ హర్షిత్ రాణా సంబరాలు చేసుకున్నాడు. ఈ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. దాంతో హర్షిత్ బౌలింగ్ ప్రద్శనను మెచ్చుకుంటూనే.. అతని ప్రవర్తనపై మాత్రం మండిపడుతున్నారు. హర్షిత్ రాణా దూకుడు తగ్గించుకోవాలని నెటిజెన్స్ సూచిస్తున్నారు. ‘హర్షిత్ రాణా.. ఈ ఎక్స్‌ట్రాలే తగ్గించుకుంటే మంచిది’, ‘టీమిండియాలోకి రావాలనుకుంటే.. ఎక్స్‌ట్రాలు పక్కనెపెట్టేయ్’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. భారత్ తరఫున హర్షిత్ ఇంకా అరంగేట్రం చేయలేదు. ఐపీఎల్‌లో 21 మ్యాచులలో 25 వికెట్స్ పడగొట్టాడు.