Site icon NTV Telugu

Tech Tips : మొబైల్ రేడియేషన్ నుంచి తప్పించుకోవాలంటే.. ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే

Radiation

Radiation

ఈ రోజుల్లో చిన్న పిల్లల నుండి పెద్ద వారి వరకు చేతిలో సెల్‌ఫోన్‌ లేకుండా కనిపించట్లేదు. సెల్‌ఫోన్‌ తో ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో అంతకంటే నష్టాలు కూడా ఉన్నాయి. దాని వలన కలిగే నష్టాలు ఏంటో తెలిస్తే కొన్ని జాగ్రత్తలు పాటించి వాటిని అధిగమించవచ్చు. మీ మొబైల్‌ నెట్‌వర్క్‌ తక్కువ సిగ్నల్‌ కలిగి ఉన్నప్పుడు అత్యధికంగా రేడియేషన్‌ ఉత్పత్తి అవుతుంది. కాబట్టి మీ మొబైల్‌లో సిగ్నల్స్‌ తక్కువ ఉన్నప్పుడు మాట్లాడటం తగ్గించాలి. మొబైల్‌ చార్జ్‌ 20 శాతం కంటే తక్కువ ఉన్నప్పుడు సాధ్యమైనంతవరకు మాట్లాడకపోవడం మంచిది.

Also Read: 100 Years Old Voters: భారత్‌లో వందేళ్లు దాటిన ఓటర్లు 2.5 లక్షల మంది
ఎందుకంటే ఆ సమయంలో మొబైల్‌ ఎక్కువ రేడియేషన్‌ తీసుకుంటుంది. కాల్స్‌ ఎక్కువ సేపు మాట్లాడాల్సినప్పుడు హెడ్‌సెట్‌ వాడడం మంచిది. ఇది ఫోన్‌ అంటీనా నుంచి తల దూరంగా ఉండేలా చేస్తుంది విధంగా రేడియేషన్‌ ప్రభావం నుండి మెదడును రక్షించుకోవచ్చు. బ్లూటూత్‌ కూడా కొంత మేరకు ఉపయోగపడుతుంది. మాట్లాడుతున్నప్పుడే కాదు వాడనప్పుడు కూడా మొబైల్‌ నుండి రేడియేషన్‌ వెలువడుతుంది. నిద్రిస్తున్న సమయంలో సెల్‌ఫోన్‌ తలకు దూరంగా ఉండేలా చూసుకోవడం మంచిది. సాధ్యమైనంతవరకు మీ సంభాషణలను మెసేజ్‌తోనే ముగించేయండి.
Also Read : బొట్టు వెనుక దాగిన రహస్యాలు

ఈ సమయంలో సెల్‌ఫోన్‌ మెదడుకు దూరంగా ఉంటుంది. కాబట్టి ఎలాంటి రేడియేషన్‌ ప్రభావము దాని పైన పడదు. సెల్‌ఫోన్‌ని ప్యాంట్‌ జేబులో పెట్టుకున్నా, బెల్ట్‌కు ధరించినా రేడియేషన్‌ ప్రభావం ఉంటుందని నిపుణులు అంటున్నారు. కాబట్టి బయటకు వెళ్ళినప్పుడు ప్యాంట్‌, చొక్కా జేబుల్లో కన్నా బ్యాగ్‌లోవేసి తీసుకోవడం మంచిది. ముఖ్యంగా చిన్న పిల్లలను సెల్‌ఫోన్‌కి దూరంగా ఉంచాలి. ఇది ఆడవారిలో రొమ్ము క్యాన్సర్‌ ప్రమాదాన్ని తెచ్చి పెట్టొచ్చు అని పరిశోధకులు చెబుతున్నారు. కాబట్టి వీలైనప్పుడల్లా సెల్‌ఫోన్‌ దూరంగా ఉంచడం మేలు. మీరు ఉపయోగిస్తున్న చేస్తున్న మొబైల్‌ రేడియేషన్‌ స్థాయి 1.6w/kg కంటే తక్కువగా ఉండేలా జాగ్రత్త పడాలి. అది దాటితే మీరు ప్రమాదంలో ఉన్నట్టే. మీ మొబైల్‌లో *#07# చేసి రేడియేషన్‌ స్థాయిని తెలుసుకోవచ్చు.

Exit mobile version