హిందూ సనాతన ధర్మంలో ప్రతి దానికి ఒక ప్రాధాన్యత ఉంది. అందులో బొట్టు పెట్టుకోవడం కూడా ఒకటి.
అమ్మాయిలు మోడ్రన్ దుస్తులకు బొట్టు పెట్టుకుంటే సెట్ అవ్వదని, అందంగా కనిపించమేమో అని బొట్టు పెట్టుకోవడం లేదు.
ఆడవారు బొట్టు పెట్టుకోవడం ఆచారం మాత్రమే కాదు దాని వెనుక కొన్ని శాస్త్రీయ కారణాలు దాగి ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
బొట్టు పెట్టుకోవడం వల్ల భక్తి, ముక్తి కలిగి నిజాయతీగా ఉండడానికి ఉపయోగపడడంతో పాటు, బొట్టు పెట్టుకున్న వారిని చూస్తే ఎదుటివారిలో పవిత్ర భావన, గౌరవాన్ని పొందుతారు.
మహిళలు కుంకుమ పెట్టుకోవడం వల్ల అది శరీరాన్ని చల్లగా ఉంచడంతో పాటు ఏకాగ్రతను పెంచి, మెదడును ఉత్సాహంగా ఉంచుతుంది.
సంతానం వేగంగా కలిగేలా చేస్తుందని, కొంతమందికి తలనొప్పి తగ్గుతుందని కొన్ని శాస్త్రాలు చెబుతున్నాయి.
సాధారణంగా బొట్టును జ్ఞాపక శక్తి, ఆలోచనా శక్తికి కనుబొమ్మల మధ్య ఉన్న ప్రదేశములో పెట్టుకుంటారు. ఈ ప్రదేశాన్ని ఆజ్ఞా చక్రం అని పిలుస్తారు.
శరీరంలో అన్ని అవయవాల కంటే కనుబొమ్మల మధ్య స్థలంలో శక్తి విద్యుదయస్కాంత తరంగ రూపంలో ప్రసరింపజేస్తుంది కాబట్టి బొట్టు కేవలం ఆడవారు మాత్రమే కాదు, మగవారికి కూడా అవసరమే.
ఇప్పట్లో అందరూ ప్లాస్టిక్ బొట్టులు పెట్టుకుంటున్నారు. కానీ అవి కేవలం అలంకరణ మాత్రమే.. వాటివల్ల చర్మానికి హాని తప్ప ఎటువంటి ప్రయోజనం ఉండదు.
అందాన్ని పెంచే బొట్టును మరవకండి.. అది హిందూధర్మానికి సూచన