Best Free AI Tools: ప్రస్తుత డిజిటల్ ప్రపంచంలో ప్రతి ఒక్కరికీ డిజిటల్ సేవలు ఎంత దగ్గరయ్యయ్యో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ అందులోకి హై స్పీడ్ ఇంటర్నెట్ ఉండడంతో డిజిటల్ ప్రపంచం దూసుకెళ్తుంది. గుండుసూది నుండి కారు కొంగులు ఇలా అనేకపనులు ఆన్ లైన్ లోనే చకచకా జరిగిపోతున్నాయి. ఒక గత కొద్దీ కాలంగా AI వచ్చాక ఈ డిజిటల్ ప్రపంచం మరింత దూసుకెళ్తుంది. మరి AI ప్రపంచంలో మన రోజువారీ అవసరాలను తీర్చే కొన్ని ఉచిత బెస్ట్ వాటిని చూసేద్దామా..
చాట్ జిపిటి (ChatGPT):
ప్రపంచంలో అత్యంత ప్రాచుర్యం పొందిన ఉచిత AI టూల్స్‌లో ఒకటి ChatGPT. దీని సహాయంతో ప్రొఫెషనల్ రిజ్యూమ్ తయారు చేయడం, ఈమెయిల్స్ రాయడం, ఆర్టికల్స్ క్రియేట్ చేయడం, రోజువారీ పనులను ప్లాన్ చేయడం చాలా సులభం అయ్యింది. అంతేకాదు సోషల్ మీడియా కంటెంట్, స్క్రిప్ట్స్, ఇన్విటేషన్ కార్డుల టెక్స్ట్, ఐడియాస్ కూడా ఇది అందించగలదు. సహజమైన, స్పష్టమైన భాషలో సమాధానాలు ఇవ్వడం ChatGPT ప్రధాన ప్రత్యేకతగా చెప్పవచ్చు. మరిన్ని ఫీచర్లు కావాలంటే ఇందులో డబ్బులు చెల్లించి వాటిని కూడా పొందవచ్చు.
Tabraiz Shamsi: క్రికెట్ సౌతాఫ్రికాకు షాక్.. కోర్టులో గెలిచిన తబ్రేజ్ షంషి.. అసలు మ్యాటరేంటంటే..?
గూగుల్ జెమినీ (Google Gemini):
టెక్ దిగ్గజం గూగుల్ సంబంధించిన జెమినీ AI కూడా అనేక సేవలను అందిస్తుంది. ఈ AI కంటెంట్ రాయడం, కొత్త ఐడియాలు ఇవ్వడం, రోజువారీ పనులను ప్లాన్ చేయడంలో ఎంతో సహాయపడుతుంది. అంతేకాకుండా ఈమెయిల్స్ డ్రాఫ్ట్ చేయడం, నోట్స్ తయారు చేయడం, ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం వంటి పనుల్లో ఇది చాలా ఉపయోగకరంగా పనిచేస్తుంది. గూగుల్ డాక్స్, జిమెయిల్ వంటి గూగుల్ టూల్స్‌తో ఇంటిగ్రేషన్ ఉండటం వల్ల ఇది మరింత శక్తివంతంగా మారింది. సాధారణ యూజర్లకు ఇది ఒక స్మార్ట్ డిజిటల్ అసిస్టెంట్‌లా పనిచేస్తుంది.
Pictory AI:
టెక్స్ట్ నుంచి వీడియోలు తయారు చేయడంలో Pictory AI, Runway ML వంటి టూల్స్ బాగా ఉపయోగపడుతాయి. బ్లాగ్, ఆర్టికల్ లేదా స్క్రిప్ట్‌ను ఇన్‌పుట్ ఇస్తే, ఇవే ఆటోమేటిక్‌గా వీడియోలను జనరేట్ చేసి చేస్తాయి. సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్లు, చిన్న వ్యాపారాలకు ఇవి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. కెమెరా లేకుండా, వీడియో ఎడిటింగ్ స్కిల్స్ అవసరం లేకుండానే ఆకట్టుకునే వీడియోలు ఇందులో రూపొందించవచ్చు.
కాన్వ (Canva) AI:
కాన్వ AI అనేది సాధారణ యూజర్లకు ఆల్-ఇన్-వన్ డిజైన్ టూల్‌గా చెప్పుకోవచ్చు. ఇది రెజ్యూమ్‌లు, ఇన్విటేషన్ కార్డులు, పోస్టర్లు, ప్రెజెంటేషన్లు, సోషల్ మీడియా పోస్టులు ఇలా అన్ని నిమిషాల్లోనే తయారు చేయవచ్చు. ఇందులో AI ఫోటో జనరేషన్, బ్యాక్‌గ్రౌండ్ రిమూవర్, రెడీమేడ్ టెంప్లేట్స్ లభిస్తాయి. డిజైనింగ్‌పై అవగాహన లేకపోయినా కాన్వ ద్వారా ప్రొఫెషనల్ అవుట్‌పుట్ పొందవచ్చు.
PSL vs IPL: ఐపీఎల్‌ను విమర్శించినందుకు వసీం అక్రమ్‌కు పాకిస్థాన్ బహుమతి
ElevenLabs లేదా PlayHT:
AI వాయిస్ జనరేషన్ కోసం ElevenLabs, PlayHT టూల్స్ బాగా ఉపయోగపడతాయి. టెక్స్ట్‌ను సహజంగా వినిపించి వాయిస్‌గా మార్చే సదుపాయం వీటిలో ఉంది. వీడియోలు, రీల్స్, ప్రెజెంటేషన్లు, ఆడియో కంటెంట్ తయారీలో ఇవి బాగా ఉపయోగిస్తున్నారు. ఫ్రీ వెర్షన్‌లో కొంత లిమిట్ ఉన్నప్పటికీ, ట్రయల్‌గా ఉపయోగించేందుకు ఇవి చాలా ఉపయోగపడతాయి.
