Site icon NTV Telugu

Croma December Sale: బెస్ట్ డీల్స్.. ఎలక్ట్రానిక్స్ గూడ్స్‌పై 60 శాతం తగ్గింపు..

Croma December Sale

Croma December Sale

Croma December Sale: ఈ-కామర్స్‌ ప్లాట్‌ఫామ్స్‌ అందుబాటులోకి వచ్చిన తర్వాత.. ఎప్పుడూ ఏదో ఆఫర్లు నడుస్తూనే ఉంటాయి.. సీజన్‌ బట్టి.. కొన్ని వస్తువులపై, పండుగలు, ఇంకా ప్రత్యేకమైన రోజుల సందర్భంలోనూ ఈ ఆఫర్ల మోత మొగుతుంది.. అమెజాన్ ఇండియా మరియు ఫ్లిప్‌కార్ట్‌లతో పాటు, అనేక ఇతర ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లు సంవత్సరాంతపు అమ్మకాలను నిర్వహిస్తున్నాయి. టాటా క్రోమా స్టోర్ కూడా ప్రత్యేక అమ్మకాన్ని నిర్వహిస్తోంది, అనేక ఆకర్షణీయమైన ఆఫర్‌లు, భారీ డిస్కౌంట్‌లను అందిస్తోంది. క్రోమా స్టోర్లలో ప్రస్తుతం జరుగుతున్న సేల్ పేరు క్రోమాటాస్టిక్ డిసెంబర్ సేల్. ఈ సేల్ సమయంలో యాపిల్ ఐఫోన్లు, టీవీలు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లతో పాటు మరికొన్ని వస్తువలుపై డిస్కౌంట్లు, ఆఫర్లు, గొప్ప డీల్స్‌తో అందుబాటులో ఉన్నాయి..

Read Also: China-Taiwan: చైనా-తైవాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు.. డ్రాగన్ దళాలు భారీ విన్యాసాలు

60 శాతం వరకు తగ్గింపు..
క్రోమా స్టోర్లలో కొనసాగుతున్న అమ్మకాల్లో ఎలక్ట్రానిక్స్ వస్తువులు 60 శాతం వరకు తగ్గింపుతో లభిస్తున్నాయి.. EMI నెలకు రూ.188 నుండి ప్రారంభమవుతుంది.. వీటికి తోడు క్రోమా స్టోర్లలో ఎంపిక చేసిన బ్యాంకుల కార్డులను ఉపయోగించడంపై తక్షణ క్యాష్‌బ్యాక్‌ను కూడా ప్రకటించింది. ఇందులో ICICI, IDFC, HDFC బ్యాంక్ మరియు ఇతర బ్యాంకు కార్డులు ఉన్నాయి.. ఈ సేల్‌లో మీరు చాలా తక్కువ ధరలకు గీజర్‌లను కొనుగోలు చేయవచ్చు. మీరు క్రోమా 5-లీటర్ ఇన్‌స్టంట్ గీజర్‌ను కేవలం రూ.3,999కే కొనుగోలు చేయవచ్చు. వివిధ సామర్థ్యాల గీజర్‌లు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. క్రోమా స్టోర్లు కూడా హీటర్లపై ఆఫర్లను అందిస్తున్నాయి. రూమ్ ఫ్యాన్ హీటర్లు మరియు ఆయిల్ హీటర్లు రెండూ అమ్మకానికి ఉన్నాయి. ఈ సేల్ సమయంలో అనేక అద్భుతమైన ఆఫర్లు మరియు డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి.

టీవీలపై ఆఫర్లు..
క్రోమా స్టోర్లలో 32 అంగుళాల LED టీవీని రూ.8,690కి కొనుగోలు చేయవచ్చు. క్రోమా తన సొంత బ్రాండ్ LED HD టీవీలను రూ.8,690కి విక్రయిస్తోంది. 43 అంగుళాల QLED గూగుల్ టీవీని కూడా క్రోమా స్టోర్లలో రూ.16,990కి కొనుగోలు చేయవచ్చు. చాలా వస్తువులపై 60 శాతం వరకు తగ్గింపుతో లభిస్తాయి, EMI నెలకు రూ.188 నుండి ప్రారంభం అవుతున్నాయి.. ఇక, ఇదే కదా నచ్చిన ఆఫర్‌లో మొచ్చిన వస్తువులను కొనుగోలు చేసే సమయం..

Exit mobile version