స్మార్ట్ ఫోన్స్ బడ్జెట్ ధరల్లోనే అందుబాటులో ఉంటున్నాయి. కంపెనీల మధ్య నెలకొన్న పోటీతో తక్కువ ధరకే 5G ఫోన్లు లభిస్తున్నాయి. రూ. 15 వేల బడ్జెట్ ధరలో క్రేజీ ఫీచర్లతో 5G స్మార్ట్ ఫోన్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ బడ్జెట్‌లో పవర్ ఫుల్ బ్యాటరీలతో పాటు, అద్భుతమైన ఫీచర్లు, బిగ్ డిస్‌ప్లే, బెస్ట్ కెమెరాను అందించే ఐదు ఉత్తమ 5G ఫోన్‌లు అందుబాటులో ఉన్నాయి. ఈ జాబితాలో Samsung, Motorola, Vivo, Realme నుంచి స్మార్ట్‌ఫోన్‌లు ఉన్నాయి. కొత్త ఫోన్ కొనాలనుకునే వారు ఈ స్మార్ట్ ఫోన్లపై ఓ లుక్కేయండి.
Also Read:IND vs SA 1st Test: 15 ఏళ్ల తర్వాత.. కోల్ కతా టెస్ట్ లో దక్షిణాఫ్రికా విజయం..
సామ్ సంగ్ గెలాక్సీ M36 5G
ఈ జాబితాలో మొదటి ఫోన్ సామ్ సంగ్ నుంచి వచ్చింది. ప్రస్తుతం దీని ధర రూ.12,499. ఈ హ్యండ్ సెట్ 6.7-అంగుళాల సూపర్ AMOLED డిస్ప్లేను కలిగి ఉంది. ఈ హ్యాండ్ సెట్ Exynos చిప్‌సెట్, 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. సామ్ సంగ్ నుంచి శక్తివంతమైన 5G ఫోన్ కోసం చూస్తున్న వారికి ఇది బెస్ట్ ఆప్షన్.
మోటరోలా G45 5G
ప్రస్తుతం రూ.9,999 ధరకు లభ్యమవుతున్న ఈ మోటరోలా ఫోన్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఈ హ్యాండ్ సెట్ లో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 2-మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా ఉన్నాయి. ఇంకా, ఈ ఫోన్‌లో 16-మెగాపిక్సెల్ ఫ్రంట్ సెల్ఫీ కెమెరా కూడా ఉంది. ఈ హ్యాండ్ సెట్ 5000mAh బ్యాటరీ, 6.5-అంగుళాల IPS LCD డిస్ప్లేను కలిగి ఉంది.
వివో Y31 5G
ఈ వివో ఫోన్ ధర రూ. 14,999, 6.68-అంగుళాల IPS LCD డిస్ప్లేను కలిగి ఉంది. ఈ హ్యాండ్ సెట్ 1000 నిట్‌ల వరకు గరిష్ట ప్రకాశాన్ని సపోర్ట్ చేస్తుంది. ఇది 50-మెగాపిక్సెల్ వెనుక కెమెరా, 8-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. ఈ ఫోన్ 6500mAh బ్యాటరీతో వస్తుంది. స్నాప్‌డ్రాగన్ 4 Gen 2 ప్రాసెసర్ ద్వారా శక్తిని పొందుతుంది.
iQOO Z10x 5G ఫోన్
ఇది ప్రస్తుతం రూ. 13,998 కు కొనుగోలుకు అందుబాటులో ఉంది. ఈ ఫోన్‌లో మీడియాటెక్ 7300 చిప్‌సెట్, 6,500mAh బ్యాటరీ ఉన్నాయి. ఈ ఫోన్‌లో 6.72-అంగుళాల IPS LCD డిస్‌ప్లే కూడా ఉంది. 50-మెగాపిక్సెల్ వెనుక కెమెరా, 8-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉన్నాయి.
Also Read:Delhi Car Blast: ఢిల్లీ పేలుడు వెనక ‘‘సైతాన్ తల్లి’’.? ఫోరెన్సిక్ అనుమానం..
రియల్‌మే పి3ఎక్స్ 5జి
దీని ధర రూ. 11,499. ఈ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.72-అంగుళాల డిస్‌ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 6400 ప్రాసెసర్‌ను కలిగి ఉంది. 6,000mAh బ్యాటరీని కలిగి ఉంది. మెరుగైన 5G కనెక్టివిటీ, మెరుగైన పనితీరును కోరుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్.
