Twitter New CEO: ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ట్విటర్ ను చేజిక్కున్న తర్వాత చాలా మార్పులు తీసుకొచ్చారు. రోజుకో షాకింగ్ నిర్ణయంతో వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా ఆయన ట్విటర్ సీఈవో పదవి రాజీనామా చేస్తానని… తర్వాత ట్విట్టర్ సీఈవో బాధ్యతలు చూసుకునేందుకు ఓ మూర్ఖుడు కావలెను.. అంటూ ట్వీట్ చేశారు మస్క్. సాక్షాత్తూ ట్విట్టర్ అధినేత చేసిన అలా ప్రకటించడంతో పాటు.. సీఈవోగా తాను కొనసాగాలా వద్దా అనేది ఆ పోల్ నిర్వహించారు. ఈ పోల్ లో ఆయనకు వ్యతిరేకంగా మెజార్టీ నెటిజన్లు తీర్పు ఇచ్చారు. ఈ పోల్‌లో 57.5 శాతం మంది వైదొలగాలని..మిగిలినవారు కొనసాగాలని ఓటేశారు. ట్విట్టర్ సీఈవోగా చేరేందుకు సరిపోయే మూర్ఘుడు దొరికిన వెంటనే సీఈవో పదవికి రాజీనామా చేస్తానని ట్వీట్ చేశారు. తాను సాఫ్ట్‌వేర్, సర్వర్ బృందాల్ని చూసుకుంటానన్నారు.
Read Also: Russia: అమెరికా మాతో పరోక్షంగా యుద్ధం చేస్తోంది..
ఈ క్రమంలోనే బెస్ కాల్బ్(35).. తనకు ట్విటర్ కొత్త సీఈవోగా అవకాశం ఇచ్చినందుకు ఎలన్ మస్క్‌కు కృతజ్ఞతలు చెబుతూ ఓ ట్వీట్ చేసింది. ఇప్పటివరకు తాము(ఎలన్ మస్క్) కలుసుకోనేలేదని, ఈ పరిణామం తనకు ఆశ్చర్యం కలిగిందని చెబుతూనే.. సీఈవో బాధ్యతలను తాను ఒక గౌరవంగా భావిస్తానని పోస్ట్ చేసింది. ఆపై వరుసగా ఐదు పోస్టులు చేశారామె. అంతేకాదు..ఆపై మొదటి రోజు బాధ్యతలు నిర్వర్తించానని, అద్భుతంగా ఉందని పోస్ట్ కూడా చేసింది. బెస్ కాల్బ్.. ఎవరోకాదు.. ఆమె ఒక పాపులర్ టీవీ షో ‘జిమ్మీ కుమ్మెల్’కు స్క్రిప్ట్ రైటర్. ఎమ్మీ అవార్డుకు కూడా నామినేట్ అయ్యారామె. సరదా సంభాషణలకు ఆమె పెట్టింది పేరు. దీంతో ఆమె వ్యంగ్యంగా అలా ట్వీట్లు చేసి ఉంటుందని పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అంతేకాదు.. గతంలో ఆమె ఎలన్ మస్క్‌ను విమర్శించిన విషయాన్ని ఈ సందర్భంగా పలువురు గుర్తు చేస్తున్నారు. ఇక కొత్త సీఈవో బాధ్యతలపైనా తొలుత సరదాగా స్పందించిన మస్క్.. ఆ తర్వాత సీరియస్‌గా సమాధానం ఇచ్చారు. తాము కేవలం బాధ్యతతో ట్విటర్‌ను నిలబెట్టే వ్యక్తి కోసం వెతుకుతున్నానంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.