Bengaluru Rave Party Having Rs 50 Lakh Entry Fee: బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలోని ఓ ఫాం హౌస్ లో జరిగిన రేవ్ పార్టీ లో ఐదుగురిని పోలీసులు నిందితులుగా చేర్చిన విషయం తెలిసిందే. ఈ పార్టీపై బెంగళూరు పోలీసులు దాడి చేసి పలువురిని అదుపులోకి తీసుకున్నారు. . పార్టీలో డ్రగ్స్ తో పాటు ఇతర మాదక. ద్రవ్యాలను వినియోగించారనే ఆరోపణలు రావడంతో.. అదుపులో తీసుకున్న వారి నుంచి బ్లడ్ శాంపిల్స్ సేకరించారు. రిసార్ట్స్ ఆవరణలో సర్వేపల్లి ఎమ్మెల్యే… రాష్ట్ర మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పేరుతో స్టిక్కర్ ఉన్న కారును కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అంతేగాక కారులో కొన్ని పత్రాలు కూడా లభ్యమైనట్లు తెలిసింది. ఈ విషయం వెలుగులోకి రావడంతో ఆ స్టిక్కర్ తో తనకు సంబంధం లేదని.. అది వారికి ఎలా వచ్చిందో విచారణ చేయాలని కోరుతూ కాకాని వ్యక్తిగత సహాయకుడు శంకర్… నెల్లూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఈ రేవ్ పార్టీ చాలా కాస్ట్లీ అని అంటున్నారు.
Samantha: నువ్వు గెలవడం చూడాలనుంది.. సమంత షాకింగ్ పోస్ట్
ఈ రేవ్ పార్టీకి ఒక్క రోజుకు ఎంట్రీ ఫీజు అక్షరాలా రూ.50 లక్షలు అని పోలీసుల విచారణలో వెల్లడైనట్లు చెబుతున్నారు. సోమవారం తెల్లవారుజామున బెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో ఉన్న ఫామ్ హౌస్‌లో జరుగుతున్న ఈ రేవ్ పార్టీపై బెంగళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు దాడి చేసి ఆ రేవ్ పార్టీలో భారీగా మత్తు పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. 17 ఎండీఎంఏ ట్యాబ్లెట్లు, కొకైన్, ఇతర డ్రగ్స్.. ఆ ఫామ్ హౌస్‌లో దొరికినట్లు చెబుతన్నారు. వాసు అనే వ్యక్తి బర్త్ డే సందర్భంగా ఈ పార్టీని ఏర్పాటు చేయగా మరో 15 లగ్జరీ కార్లను కూడా ఫామ్ హౌజ్ వద్ద పార్కింగ్ చేసినట్లు పేర్కొన్నారు. ఈ రేవ్ పార్టీపై ఎలక్ట్రానిక్ సిటీ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఇక ఎంట్రీ ఫీజు గురించి చర్చ జరుగుతోంది. 50 లక్షలతో హైదరాబాద్ శివార్లలో ఒక లగ్జరీ అపార్ట్మెంట్ కొనుక్కోవచ్చని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.