Site icon NTV Telugu

Air india: తమిళనాడులో ఎయిరిండియా విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్

Aie

Aie

ఎయిరిండియా విమానాలు వరుస ప్రమాదాలకు గురవుతున్నాయి. శుక్రవారం పూణె ఎయిర్‌పోర్టులో ఎయిరిండియా విమానం టగ్ ట్రక్కును ఢీకొట్టి డ్యామేజీకి గురైంది. ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అలాగే బెంగళూరు-ఢిల్లీ విమానం కూడా శనివారం ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది. తాజాగా శనివారం బెంగళూరు వెళ్లే ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం తమిళనాడులో అత్యవసరంగా ల్యాండ్ అయింది. సాంకేతిక లోపం తలెత్తడంతో విమానాన్ని తిరుచిరాపల్లికి మళ్లించారు. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి ఎయిర్‌లైన్ విచారం వ్యక్తం చేసింది.

137 మంది ప్రయాణికులతో బెంగళూరుకు బయలుదేరిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో అత్యవసర ల్యాండింగ్ చేసినట్లు ఎయిర్‌లైన్ శనివారం తెలిపింది. మే 18న తిరువనంతపురం-బెంగళూరు సెక్టార్‌కు వెళ్లే విమానం సాంకేతిక సమస్య కారణంగా తిరుచిరాపల్లికి మళ్లించారు. బెంగళూరుకు ప్రత్యామ్నాయంగా మరో విమానాన్ని ఏర్పాటు చేసినట్లు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ప్రతినిధి తెలిపారు. ప్యాసింజర్స్‌కు ఏర్పడిన అసౌకర్యానికి చింతిస్తున్నట్లు వెల్లడించారు.

శుక్రవారం బెంగళూరు నుంచి బయలుదేరిన ఎయిరిండియా విమానం పవర్ యూనిట్ నుంచి అగ్ని ప్రమాద హెచ్చరిక తర్వాత సాయంత్రం ఢిల్లీకి తిరిగి వచ్చి విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండింగ్ అయింది. విమానంలో దాదాపు 175 మంది ప్రయాణికులు ఉన్నారు.

Exit mobile version