NTV Telugu Site icon

Bengal rail accident: మృతుల కుటుంబాలకు కేంద్రం రూ.10 లక్షల ఎక్స్ గ్రేషియా..

Bengal Rail Acciden

Bengal Rail Acciden

Bengal rail accident: కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ( Ashwini Vaishnaw) జూన్ 17, సోమవారం పశ్చిమ బెంగాల్‌ లోని రంగపాణి స్టేషన్ సమీపంలో రైలు ప్రమాదంలో మరణించిన వారి బంధువులకు రూ. 10 లక్షలు ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. అలాగే తీవ్రంగా గాయపడిన వ్యక్తులకు రూ. 2.5 లక్షల పరిహారం ప్రకటించారు ఆయన. వారితోపాటు స్వల్ప గాయాలైన ప్రయాణికులకు రూ. 50 వేలు ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. సీల్దా నుంచి వెళ్తున్న కాంచనజంగా ఎక్స్‌ప్రెస్‌ ను గూడ్స్ రైలు ఢీకొనడంతో ఈ ప్రమాదంలో 15 మంది మృతి చెందగా, 150 మందికి పైగా గాయపడ్డారు.

IIT Kharagpur: ఐఐటీ ఖరగ్‌పూర్ లో ఉరి వేసుకున్న విద్యార్థిని..

రైల్వే బోర్డు ఛైర్మన్, సీఈఓ జయ వర్మ సిన్హా ప్రకారం.. చనిపోయిన ఐదుగురిలో గూడ్స్ రైలు డ్రైవర్, అసిస్టెంట్ డ్రైవర్‌తో పాటు కాంచన్‌జంగా ఎక్స్‌ప్రెస్ రైలు యొక్క గార్డు కూడా ఉన్నారు. మేము గాయపడిన వారిని సిలిగుడి లోని ఉత్తర బెంగాల్‌లోని మెడికల్ కాలేజీకి తరలించామని ఆమె చెప్పారు. అగర్తలా సీల్దా మార్గంలో ఉన్న అన్ని రైల్వే స్టేషన్లలో హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటు చేయబడ్డాయని ఆవిడ తెలిపారు. కాంచన్‌ జంగా ఎక్స్‌ప్రెస్‌ లోని మూడు వెనుక కంపార్ట్‌మెంట్‌లు వెనుక నుండి గూడ్స్ రైలు ఇంజన్ ఢీకొన్న ప్రమాదంలో పట్టాలు తప్పాయి. దింతో ప్రాణనష్టానికి దారి తీసింది.