Site icon NTV Telugu

Ben Stokes: నా డబ్బులు నాకు వొచ్చాయి.. ఇక పోయివొస్తా..

Ben Stocks

Ben Stocks

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023లో కష్టపడకుండా అధికంగా లాభపడిన ఆటగాడు ఎవరైనా ఉన్నారా అంటే..? అది చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ఆల్ రౌండర్ బెన్‌ స్టోక్స్‌ అని చెప్పొచ్చు.. ఈ 16.25 కోట్ల ఆటగాడు సీజన్‌ మొత్తంలో ఆడింది రెండే మ్యాచ్‌లు. అందులో అతను చేసిన పరుగులు కూడా 16 మాత్రమే. అంటే ఒక్కో పరుగుకు సీఎస్కే యాజమాన్యం కోటి రూపాయలపైగానే చెల్లించింది అన్న మాట. ఇంత ఘనకార్యం వెలగబెట్టిన ఈ ఇంగ్లీష్‌ ఆల్‌రౌండర్‌ ఇప్పుడు స్వదేశానికి బయల్దేరాడు.

Also Read : Bengaluru Rains: బెంగళూర్‌లో భారీ వర్షం.. ఏపీకి చెందిన ఒకరు మృతి..

స్వదేశంలో ఐర్లాండ్‌తో జరిగే ఏకైక టెస్ట్‌ మ్యాచ్‌ (జూన్‌ 1 నుంచి) ఆడేందుకు స్టోక్స్‌ చెన్నై సూపర్ కింగ్స్ క్యాంప్‌ను వీడాడు. ఈ విషయాన్ని సీఎస్‌కే యాజమాన్యమే అధికారికంగా ట్వీట్‌ చేసింది. జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించేందుకు కోట్లు పోసి కొనుక్కున ఫ్రాంచైజీకి అన్యాయం చేసిన స్టోక్స్‌పై సీఎస్‌కే అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కారణాలు ఏవైనా డబ్బులిచ్చాక లీగ్‌ అయిపోయేంత వరకు ఉండాలని చురకలంటిస్తున్నారు.

Also Read : IPL 2023 : ముంబై ఇండియన్స్ ముందు భారీ టార్గెట్

దేశం కోసం మాత్రమే ఆడాలనుకున్నప్పుడు.. ఆసీస్‌ బౌలర్‌ మిచెల్‌ స్టార్క్‌ లాగా ఐపీఎల్‌లో పేరు కూడా నమోదు చేసుకోకుండా ఉండాల్సిందంటూ సీఎస్కే ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఐపీఎల్‌ ఆడటానికి వచ్చినట్లు లేదు, సమ్మర్‌ వెకేషన్‌ ఎంజాయ్‌ చేయడానికి వచ్చినట్లుందని అంటున్నారు. కాగా, ఐపీఎల్‌ నిబంధనల ప్రకారం ఒప్పందం చేసుకున్న ఆటగాడు ఆడినా ఆడకపోయినా పూర్తి డబ్బులు చెల్లించాల్సిందే. దీంతో బెన్ స్టోక్స్ కు సీఎస్కే యాజమాన్యం రూ. 16 కోట్లు చెల్లించింది.

Exit mobile version