NTV Telugu Site icon

Ben Stokes Century: ప్రపంచంలో రెండో క్రికెటర్‌గా బెన్‌ స్టోక్స్‌.. ఒక్క రన్‌తో ధోనీ రికార్డు మిస్‌!

Ben Stokes Century

Ben Stokes Century

Ben Stokes struck the highest score by an England batsman in ODI: ఇంగ్లండ్‌ స్టార్ ఆల్‌రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌ అరుదైన రికార్డు నెలకొల్పాడు. బ్యాటింగ్‌ ఆర్డర్‌లో నాలుగు లేదా అంతకంటే దిగువ స్థానంలో వచ్చి.. వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేసిన రెండో క్రికెటర్‌గా నిలిచాడు. నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో జరిగిన మూడో వన్డేలో భారీ సెంచరీ (182; 124 బంతుల్లో 15 ఫోర్లు, 9 సిక్సర్లు) చేసిన స్టోక్స్‌ ఈ రికార్డు తన పేరుపై లిఖించుకున్నాడు. వన్డే ఫార్మాట్‌లో తన రిటైర్మెంట్‌ నిర్ణయాన్ని స్టోక్స్‌ ఇటీవలే వెనక్కి తీసుకున్న విషయం తెలిసిందే.

వన్డేల్లో నాలుగు లేదా ఆ తర్వాతి స్థానాల్లో వచ్చి అత్యధిక పరుగులు సాధించిన జాబితాలో వెస్టిండీస్‌ దిగ్గజం సర్‌ వివియన్‌ రిచర్డ్స్ అగ్ర స్థానంలో ఉన్నాడు. రిచర్డ్స్ 189 రన్స్ చేశాడు. ఈ జాబితాలో మాజీ క్రికెటర్లు రాస్‌ టేలర్‌ (181), ఏబీ డివిలియర్స్‌ (176), కపిల్‌ దేవ్‌ (175)లను అధిగమించి.. బెన్‌ స్టోక్స్‌ రెండో స్థానానికి చేరుకున్నాడు. వివియన్‌ రిచర్డ్స్‌ 181 పరుగులు కూడా చేశాడు.

వన్డే ఫార్మాట్‌లో ఇంగ్లండ్‌ తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన ప్లేయర్‌గా బెన్‌ స్టోక్స్‌ చరిత్రకెక్కాడు. జేసన్‌ రాయ్‌ పేరిట ఉన్న రికార్డును స్టోక్స్‌ బద్దలు కొట్టాడు. 2018లో ఆస్ట్రేలియాపై రాయ్‌ 180 రన్స్ చేశాడు. మరోవైపు వన్డేల్లో నాన్‌ ఓపెనర్‌గా బరిలోకి దిగి.. అత్యధిక స్కోరు సాధించిన ఆరో ఆటగాడిగా కూడా స్టోక్స్‌ నిలిచాడు. ఈ జాబితాలో చార్ల్స్‌ కొవంట్రీ (194), వివియన్‌ రిచర్డ్స్‌ (189), ఫాఫ్‌ డుప్లెసిస్‌ (185), ఎంఎస్ ధోనీ (183), విరాట్‌ కోహ్లీ (183) స్టోక్స్‌ కంటే ముందున్నారు. ఒక్క రన్‌తో ధోనీ రికార్డు స్టోక్స్‌ మిస్‌ అయ్యాడు.

Also Read: Jio 7th Anniversary Offer: జియో యూజర్లకు శుభవార్త.. ఈ మూడు రీఛార్జ్ ప్లాన్‌లపై అదనపు బెనిఫిట్స్!

మూడో వన్డేలో ఇంగ్లండ్‌ 181 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌పై విజయం సాధించింది. ఈ మ్యాచులో ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్‌ 48.1 ఓవర్లలో 368 పరుగులకు ఆలౌట్ అయింది. స్టోక్స్ సహా డేవిడ్‌ మలాన్‌ (96; 12 ఫోర్లు, 1 సిక్స్‌) శతకం బాదాడు. ఆపై లక్ష్య ఛేదనకు దిగిన న్యూజిలాండ్‌.. ఇంగ్లండ్‌ బౌలర్ల ధాటికి 187 పరుగులకే కుప్పకూలింది. గ్లెన్‌ ఫిలిప్స్‌ (72) ఒంటరి పోరాటం చేశాడు. ఈ విజయంతో నాలుగు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో ఇంగ్లండ్‌ 2-1తో ఆధిక్యంలోకి వెళ్ళింది.