NTV Telugu Site icon

ENG vs AUS: బెన్‌ డకెట్‌ ఊచకోత.. ఆస్ట్రేలియా ముందు భారీ లక్ష్యం

Ben Duckett

Ben Duckett

ఛాపియన్ లాహోర్‌లో ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఇరు జట్లకు ఇది తొలి మ్యాచ్. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. బారిలోకి దిగిన ఇంగ్లాండ్ 50 ఓవర్లలో 351 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. మొదట ఆస్ట్రేలియా 43 పరుగుల వ్యవధిలో 2 వికెట్లు పడగొట్టింది. ఫిల్ సాల్ట్ 10 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. జామీ స్మిత్ 15 పరుగులకే వెనుదిరిగాడు. ఆస్ట్రేలియన్ బౌలర్లు తమ తొలి విజయం పట్ల గర్వంగా ఫీలయ్యారు. కానీ బెన్ డకెట్, జో రూట్‌తో కలిసి కంగారూల ఆనందానికి ముగింపు పలికారు.

బెన్ డకెట్, జో రూట్ కేవలం 25.4 ఓవర్లలో 158 పరుగులు జోడించి ఇంగ్లీష్ జట్టును భారీ స్కోరు దిశగా తీసుకెళ్లారు. రూట్ 68 పరుగుల చేసి అవుట్ అయ్యాడు. కానీ బెన్ డకెట్ మాత్రం ఊచకోత కోశాడు. రూట్ ఔటైన వెంటనే తర్వాతి ఓవర్లో రెండు వరుస ఫోర్లు కొట్టాడు. దీంతో సెంచరీని పూర్తి చేసుకున్నాడు. అంతటితో ఆగలేదు. 48.4 ఓవర్ల వరకు క్రీజ్‌లో ఉన్న బెన్‌ డకెట్‌165 పరుగులు పూర్తి చేసి లబుషేన్‌ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. అనంతరం జోఫ్రా ఆర్చర్‌ క్రీజ్‌లోకి వచ్చాడు.

30 ఏళ్ల బెన్ డకెట్ ప్రస్తుత ఛాంపియన్స్ ట్రోఫీలో సెంచరీ చేసిన ఆరో బ్యాట్స్ మన్ గా నిలిచాడు. ఈ టోర్నమెంట్‌లో సెంచరీ చేసిన తొలి బ్యాట్స్‌మన్ న్యూజిలాండ్‌కు చెందిన విల్ యంగ్. 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో న్యూజిలాండ్‌కు చెందిన టామ్ లాథమ్, భారత్‌కు చెందిన శుభ్‌మాన్ గిల్, దక్షిణాఫ్రికాకు చెందిన ర్యాన్ రికెల్టన్, బంగ్లాదేశ్‌కు చెందిన తౌహీద్ హ్రిడోయ్ కూడా సెంచరీలు సాధించారు.