Site icon NTV Telugu

Bellamkonda Srinivas: కాబోయే భార్య ‘కావ్య’పై..శ్రీనివాస్ ఎమోషనల్ పోస్ట్!

Bellamkonda Sreenivas

Bellamkonda Sreenivas

టాలీవుడ్ మాస్ అండ్ యాక్షన్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఇంటిలో పెళ్లి బాజాలు మోగనున్నాయి. ఎటువంటి హడావుడి లేకుండా, అత్యంత సన్నిహితుల మధ్య ‘అజూర్ కోవ్’ (Azure Cove) అనే అందమైన ప్రదేశంలో శ్రీనివాస్ నిశ్చితార్థ వేడుక వైభవంగా జరిగింది. తన నిశ్చితార్థంపై స్పందిస్తూ శ్రీనివాస్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక హార్ట్ టచింగ్ నోట్ రాశారు. ‘ఈ క్షణం నుండి అంతా మారిపోయింది.. నిండు మనసులతో, ఒకరి కళ్లలో ఒకరం చూసుకుంటూ ఒక శాశ్వతమైన బంధంలోకి అడుగుపెట్టాం. ఇది కేవలం నిశ్చితార్థం మాత్రమే కాదు.. ఒక అద్భుతమైన ప్రయాణానికి ఆరంభం’ అంటూ తన సంతోషాన్ని పంచుకున్నారు.

Also Read : Sharwanand: ప్రాణాలకు తెగించినా గుర్తింపు లేదా? ‘జాను’ షూటింగ్ ప్రమాదంపై శర్వానంద్ ఆవేదన!

శ్రీనివాస్ తన కాబోయే భార్య కావ్యారెడ్డిని ‘కావ్యమ్మ’ అని పిలుస్తూ గతంలోనే పరిచయం చేసిన సంగతి తెలిసిందే. తన జీవితంలోకి పాజిటివిటీని తీసుకొచ్చినందుకు ఆమెకు థ్యాంక్స్ చెబుతూ శ్రీనివాస్ చేసిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఈ కొత్త జంట ఫోటోలు చూసి సినీ ప్రముఖులు మురిసిపోతున్నారు. శ్రీనివాస్ సరసన నటించిన చందమామ కాజల్ అగర్వాల్ “బ్యూటీఫుల్” అని కామెంట్ చేయగా, మరో హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ హార్ట్ ఎమోజీలతో తన శుభాకాంక్షలు తెలిపింది. గతంలోనే వీరి ఎంగేజ్‌మెంట్ అయిపోయిందని వార్తలు వచ్చినా, అది కేవలం ఫ్యామిలీ అనౌన్స్‌మెంట్ మాత్రమేనని, అసలైన వేడుకలు ఇప్పుడే మొదలయ్యాయని శ్రీనివాస్ క్లారిటీ ఇచ్చారు. త్వరలోనే వీరి పెళ్లి తేదీని అధికారికంగా ప్రకటించనున్నారు.

Exit mobile version