Bellamkonda Srinivas: కాబోయే భార్య ‘కావ్య’పై..శ్రీనివాస్ ఎమోషనల్ పోస్ట్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ మాస్ అండ్ యాక్షన్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఇంటిలో పెళ్లి బాజాలు మోగనున్నాయి. ఎటువంటి హడావుడి లేకుండా, అత్యంత సన్నిహితుల మధ్య ‘అజూర్ కోవ్’ (Azure Cove) అనే అందమైన ప్రదేశంలో శ్రీనివాస్ నిశ్చితార్థ వేడుక వైభవంగా జరిగింది. తన నిశ్చితార్థంపై స్పందిస్తూ శ్రీనివాస్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక హార్ట్ టచింగ్ నోట్ రాశారు. ‘ఈ క్షణం నుండి అంతా మారిపోయింది.. నిండు మనసులతో, ఒకరి కళ్లలో ఒకరం చూసుకుంటూ ఒక శాశ్వతమైన బంధంలోకి అడుగుపెట్టాం. ఇది కేవలం నిశ్చితార్థం మాత్రమే కాదు.. ఒక అద్భుతమైన ప్రయాణానికి ఆరంభం’ అంటూ తన సంతోషాన్ని పంచుకున్నారు.
Also Read : Sharwanand: ప్రాణాలకు తెగించినా గుర్తింపు లేదా? ‘జాను’ షూటింగ్ ప్రమాదంపై శర్వానంద్ ఆవేదన!
Also Read
శ్రీనివాస్ తన కాబోయే భార్య కావ్యారెడ్డిని ‘కావ్యమ్మ’ అని పిలుస్తూ గతంలోనే పరిచయం చేసిన సంగతి తెలిసిందే. తన జీవితంలోకి పాజిటివిటీని తీసుకొచ్చినందుకు ఆమెకు థ్యాంక్స్ చెబుతూ శ్రీనివాస్ చేసిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఈ కొత్త జంట ఫోటోలు చూసి సినీ ప్రముఖులు మురిసిపోతున్నారు. శ్రీనివాస్ సరసన నటించిన చందమామ కాజల్ అగర్వాల్ “బ్యూటీఫుల్” అని కామెంట్ చేయగా, మరో హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ హార్ట్ ఎమోజీలతో తన శుభాకాంక్షలు తెలిపింది. గతంలోనే వీరి ఎంగేజ్‌మెంట్ అయిపోయిందని వార్తలు వచ్చినా, అది కేవలం ఫ్యామిలీ అనౌన్స్‌మెంట్ మాత్రమేనని, అసలైన వేడుకలు ఇప్పుడే మొదలయ్యాయని శ్రీనివాస్ క్లారిటీ ఇచ్చారు. త్వరలోనే వీరి పెళ్లి తేదీని అధికారికంగా ప్రకటించనున్నారు.
తాజావార్తలు
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
-
YS Jagan : రాయలసీమ హార్టికల్చర్‌పై చంద్రబాబువి అంకెల గారడీలు
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!