Site icon NTV Telugu

Andhrapradesh: విధుల బహిష్కరణకు బెజవాడ బార్ అసోసియేషన్ పిలుపు

Vijayawada

Vijayawada

Andhrapradesh: నేడు విధుల బహిష్కరణకు బెజవాడ బార్ అసోసియేషన్ పిలుపునిచ్చింది. నందిగామలో న్యాయవాదిపై పోలీసుల దాడికి నిరసనగా విధుల బహిష్కరణకు నందిగామ బార్ అసోసియేషన్ నిర్ణయం తీసుకుంది. న్యాయవాదిపై పోలీసులు దాడికి పాల్పడగా.. న్యాయవాదికి సంఘీభావంగా మద్దతు తెలుపుతూ విధులు బహిష్కరణకు బెజవాడ బార్ అసోసియేషన్ పిలుపు ఇచ్చింది. నేడు చంద్రబాబును కస్టడీకి కోరుతూ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్‌పై ఏసీబీ కోర్టు విచారణ జరపనుంది. బార్‌ అసోసియేషన్‌ విధులు బహిష్కరణ పిలుపుతో నేడు విచారణ జరుగుతుందా లేక వాయిదా పడుతుందా అని సందిగ్ధం నెలకొంది.

Also Read: Chandrababu Case: చంద్రబాబును కస్టడీకి ఇవ్వాలని పిటిషన్.. ఏసీబీ కోర్టులో నేడు విచారణ

స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం కేసులో చంద్రబాబును సీఐడీ కస్టడీకి ఇవ్వాలన్న పిటిషన్‌పై బుధవారం ఏసీబీ కోర్టులో నేడు విచారణ జరగనుంది. చంద్రబాబును 5 రోజుల కస్టడీకి కోరుతూ సీఐడీ అధికారులు పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. చంద్రబాబు లాయర్లు కౌంటర్‌ పిటిషన్‌ దాఖలు చేయకపోవడంతో ఏసీబీ కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. కౌంటర్‌ పిటిషన్‌ను బుధవారం దాఖలు చేస్తామని చంద్రబాబు తరఫున లాయర్లు న్యాయస్థానానికి వివరించారు. ఈ నేపథ్యంలో నేడు విచారణ జరుగుతుందా లేదా అనే సందేహం ఏర్పడింది.

Exit mobile version