NTV Telugu Site icon

Brewing of Beer: బీర్ ప్రియులూ ఇది విన్నారా?.. మూత్రంతో బీర్ల తయారీ.. ఎక్కడంటే?

Beer

Beer

ఎండాకాలం వచ్చిందంటే చాలు.. కూల్ కూల్‌ ఐస్ క్రీంలు, కూల్ డ్రింకులకు ఎంత డిమాండ్ ఉంటుందో.. అంతకు రెట్టింపు డిమాండ్ బీర్లకు పెరుగుతుంది. మద్యం ప్రియుల్లో విస్కీ, బ్రాండీ, వొడ్కాలకు ఫ్యాన్స్ ఉంటారు. కానీ.. వేసవి వచ్చేసరికి మాత్రం మద్యంప్రియులంతా చల్లచల్లని బీర్లకే జై కొడుతుంటారు. ఏ చిన్న అకేషన్ వచ్చినా కాటన్లు కాటన్లు కాటన్లు ఖాళీ చేస్తుంటారు. బయట ఎండలు మండే ఎండలకు బీరే ఉపశమనమని భావిస్తుంటారు. అయితే.. ఇప్పుడు బీర్ ప్రియులకు ఓ విషయం చెప్పాలనుకుంటున్నాం. అదేంటంటే..

READ MORE: Ford: ఫోర్డ్ ఈస్ బ్యాక్.. రెండేళ్ల తర్వాత చెన్నై ప్లాంట్ రీ ఓపెన్..!

మద్యం తయారీలో సింగపూర్‌ కొత్తగా ఆలోచిస్తోంది. ఆ దేశంలో రూపొందుతున్న ఓ బీరు ప్రస్తుతం పలు దేశాల దృష్టిని ఆకర్షిస్తోంది. ఇతర బీర్ల లాగే కనిపిస్తున్నప్పటికీ దీని రేంజే వేరు. ఎందుకంటే ఇది అలాంటి రుచిని అందిస్తుందని సింగపూర్ వాసులు చెబుతున్నారు. దాని పేరే ‘న్యూబ్రూ’ బీరు. దీనిని మూత్రంతోపాటు మురుగు నుంచి శుద్ధి చేసిన నీటితో తయారు చేస్తున్నారట. మూత్రం, మురుగును శుద్ధిచేసి తీసిన నీటికి ‘నీవాటర్‌’ అని పేరు. అంతర్జాతీయ ప్రమాణాలు పాటించి శుద్ధి చేస్తోన్న ఈ నీటిని తాగునీరుగా ఉపయోగించవచ్చు. ఈ నీరు సింగపూర్‌ బ్రాండ్‌ కూడానూ. ప్రస్తుతం దీనికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

READ MORE: Yuzvendra Chahal: విధ్వంసం సృష్టించిన యుజ్వేంద్ర చాహల్..

ఈ బీరును తయారు చేసేందుకు 95శాతం నీవాటర్‌ను ఉపయోగిస్తున్నారు. దీంతోపాటు ఈ బీరు తయారీలో జర్మన్‌ బార్లీ మాల్ట్‌లు, సుగంధ సిట్రాతోపాటు దిగుమతి చేసుకున్న ఇతర పదార్థాలను వాడుతున్నారట. సింగపూర్‌ ఇంటర్నేషనల్‌ వాటర్‌ వీక్‌ (ఎస్​ఐడబ్ల్యూడబ్ల్యూ)తో కలిసి నేషనల్ వాటర్ ఏజెన్సీ (పీయూబీ), స్థానిక క్రాఫ్ట్ బీర్ బ్రూవరీ సంస్థలు ఈ బ్రాండ్‌ బీర్ ను తయారు చేస్తున్నాయి. నీటి రీసైక్లింగ్, పునర్వినియోగంపై అవగాహన కల్పించేందుకే ఇలా తయారు చేస్తున్నట్లు తయారీదారులు చెబుతున్నారు. ఈ న్యూస్ విన్న బీర్ ప్రియులు మాత్రం నిర్వెరపోతున్నారు.

Show comments