రాంచీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. తేనెటీగల దాడిలో ఒకే కుటుంబానికి చెందిన ఒక మహిళ, ముగ్గురు పిల్లలు మృతి చెందారు. మృతురాలు భర్త సునీల్ బార్లా తెలిపిన వివరాల ప్రకారం.. సెప్టెంబర్ 21 (శనివారం) తన భార్య జ్యోతి గాడి తన తల్లి గారింటికి వెళ్లింది. ఈ క్రమంలో.. ఇంటికి సమీపంలోని ఓ బావిలో స్నానం చేస్తున్నప్పుడు ఈ ప్రమాదం జరిగిందని తెలిపాడు.
Read Also: Snake bite: పాముకాటుతో యువకుడు మృతి.. అతని చితిపై పామును సజీవ దహనం
తనతో పాటు.. ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారని అన్నాడు. స్నానం చేసేందుకు ఓ బావిలోకి దిగిన వారు.. స్నానం చేస్తుండగా ఒక్కసారిగా తేనెటీగలు వారిపై దాడి చేశాయని పేర్కొన్నాడు. ఆ ప్రాంతంలోని కొంతమంది వ్యక్తులపై కూడా తేనెటీగలు దాడి చేశాయి. అయితే.. వారు వెంటనే అప్రమత్తమై సురక్షితంగా బయటపడ్డారు.. అయితే మహిళ, ఆమె పిల్లలను రక్షించేలోపు తేనెటీగల దాడిలో మరణించారు. అనంతరం.. బావిలో నుంచి మృతదేహాలను వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.
Read Also: Kashi: తిరుపతి లడ్డు తిన్నందుకు.. సనాతన పద్ధతిలో శుద్ధి.. ప్రక్రియ ఇదే!