నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. బ్రాడ్ కాస్ట్ ఇంజనీరింగ్ లిమిటెడ్ లో పలు పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేశారు.. ఈ నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 44 పోస్టులను భర్తీ చెయ్యనున్నారు.. ఈ పోస్టులకు ఎలా అప్లై చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..
పోస్టుల వివరాలు..
మొత్తం ఖాళీల సంఖ్య..44
అర్హతలు..
గుర్తింపు పొందిన యూనివర్సిటీ లో డిగ్రీ పాసై ఉండాలి.. ఈ పోస్టుల పై అనుభవం ఉంటే మంచిదని చెబుతున్నారు..
జీతం : పోస్టులకు సెలెక్ట్ అయిన అభ్యర్థుల జీతం విషయానికొస్తే .. రూ.34,362/-నెలకు చెల్లిస్తారు .. ఆ తర్వాత ఇంక్రిమెంట్స్ కూడా ఉంటాయని అధికారులు చెబుతున్నారు..
వయోపరిమితి: ఈ పోస్టులకు అప్లై చేసుకొనే అభ్యర్థుల వయస్సు నిబంధనల ప్రకారం ఉంటుంది..
దరఖాస్తు రుసుము:
SC/ST/EWS/PH ఫీజు: రూ.531, జనరల్/ఓబీసీ/మాజీ-సర్వీస్‌మెన్/మహిళా రుసుము: రూ.885 చెల్లించాల్సి ఉంటుంది.. ఫీజును కేవలం ఆన్ లైన్ ద్వారానే చెల్లించాలి.. ఫీజును చెల్లించిన తర్వాత రిసిప్ట్ ను దగ్గర ఉంచుకోవాలి..
ఈ ఉద్యోగాల పై ఆసక్తి కలిగిన వారు BECIL అధికార వెబ్ సైట్ లో పూర్తి వివరాలను తెలుసుకోని అప్లై చేసుకోవాల్సి ఉంటుంది..