Site icon NTV Telugu

Bear Attack: అందుకే అదుపులో ఉండాలనేది.. రెప్పపాటులో మహిళపై ఎలుగుబంటి దాడి..

Bear Attack

Bear Attack

కొన్నిసార్లు ప్రజలు జూ జంతువుల వద్ద చిలిపి చేష్టలు చేస్తుంటారు. కొన్నిసార్లు జంతువులకు సంబంధించి అనేక ఘటనలకు వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా అలాంటి వీడియో ఒకటి వైరల్ గా మారింది. ఈ వీడియోలో ఓ స్త్రీని చూడగానే ఎలుగుబంటి రెచ్చిపోయింది. చివరికి ఏమైందో ఓసారి చూస్తే..

Read Also: Shocking Video: వామ్మో.. ఈయన ఎవరండీ బాబు.. పుచ్చకాయ కొనకపోతే ఏం చేస్తాడేమో ఏంటో..

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో ఓ జూ యొక్క ఎలుగుబంటి ఎన్‌క్లోజర్‌ లో ఒక వ్యక్తి మరొక స్త్రీకి శిక్షణ ఇస్తాడు. స్త్రీ తన చేతిని పైకెత్తి ఎలుగుబంటికి ఆజ్ఞాపిస్తుండగా ఈ క్రమంలో ఎలుగుబంటి రెచ్చిపోతుంది. ఎలుగుబంటిని గొలుసుతో బంధించినా.. గట్టిగా పట్టుకొని దగ్గరకు లాగింది. దాంతో అలర్ట్ అయిన ఇంతలో మరో ఇద్దరు వ్యక్తులు, ఓ బాటసారి అక్కడికి చేరుకుని ఎలుగుబంటిని తరిమేశారు.

అందులో ఓ వ్యక్తి కర్రతో బలంగా కొట్టడంతో ఎలుగుబంటి భయపడి పారిపోయింది. దీంతో మహిళ సురక్షితంగా బయటపడింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో హల్చల్ చేస్తోంది. ఇంటర్నెట్ వినియోగదారులు ఈ అంశంపై వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ఇంకెందుకు అల్లాస్యం ఈ భయంకరమైన వీడియోను మీరు వీక్షంచండి.

Exit mobile version