టీ 20 వరల్డ్ కప్ లో పాల్గొన్న టీమిండియా ప్లేయర్ల కొత్త జెర్సీలను ఇవాళ విడుదల చేసింది బీసీసీఐ. దుబాయ్ లో జరుగబోయే టీ 20 వరల్డ్ కప్ లో కోహ్లీ సేన ఈ కొత్త జెర్సీలోనే కనిపించనుంది. బిలియన్ చీర్స్ జెర్సీ అన్న నినాదం తో కొత్త దుస్తులను రిలీజ్ చేసింది బీసీసీఐ. క్రికెట్ అభిమానుల చీర్స్ ప్రేరణ తో జెర్సీలను రూపిందించినట్లు బీసీసీఐ తన ట్విట్టర్ లో వెల్లడించింది. టీమిండియా జట్టుకు కిట్ స్పాన్సర్ గా ఎంపీఎల్ స్పోర్ట్స్ వ్యవహరిస్తోంది. ఈ జెర్సీలు కావాలనుకునే వారు ఆన్ లైన్ లో ఆర్డర్ చేసుకోవచ్చు. కాగా.. అక్టోబర్ 17 వ తేదీ నుంచి టీ 20 ప్రపంచ కప్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే.
టీమిండియా కొత్త జెర్సీ ఇదే..
