NTV Telugu Site icon

ICC Chairman: ఐసీసీ చైర్మన్‌గా జై షా.. బీసీసీఐ అధ్యక్ష పదవికి లైన్ క్లియర్!

Jay Shah Icc Chairman

Jay Shah Icc Chairman

BCCI secretary Jay Shah as ICC Chairman: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కార్యదర్శి జై షా.. అంతర్జాతీయ క్రికెట్ నియంత్రణ మండలి (ఐసీసీ) ఛైర్మన్‌గా పదవి చేపడతాడా? అని ఇప్పుడు ఆసక్తి రేకెత్తిస్తోంది. శుక్రవారం (జులై 19) కొలంబోలో జరగనున్న ఐసీసీ వార్షిక సమావేశం (ఏజీఎం)లో ఈ విషయంపై చర్చించే అవకాశాలు ఉన్నాయి. జులై 19 నుంచి 22 వరకు ఐసీసీ సమావేశాలు జరగనున్నాయి. ఐసీసీ బోర్డు ఆఫ్ డైరెక్టర్స్‌లో మూడు స్థానాలకు వార్షిక సమావేశాల్లో ఎన్నికలు జరగనున్నాయి. అలానే ఐసీసీ కొత్త ఛైర్మన్ గురించి, ఛాంపియన్స్ ట్రోఫీ కోసం పాకిస్థాన్‌‌కు భారత్ వెళ్తుందా? అనే విషయాలపై చర్చ సాగనుంది.

Also Read: Hardik Pandya Post: శ్రీలంక టూర్‌ వేళ.. ఆసక్తికరమైన పోస్టు పెట్టిన హార్దిక్ పాండ్యా!

ప్రస్తుతం న్యూజిలాండ్‌కు చెందిన గ్రెగ్‌ బార్క్‌లే ఐసీసీ ఛైర్మన్‌గా ఉన్నారు. 2025 వరకు అయనను కొనసాగించే అవకాశాలు లేకపోలేదు. ఒకవేళ జై షా పోటీ చేస్తే ఏకగ్రీవంగా ఎన్నికవుతాడు. జై షా ఐసీసీ ఛైర్మన్‌ అయితే.. బీసీసీఐ అధ్యక్ష పదవికి లైన్ క్లియర్ అవుతుంది. బీసీసీఐ రూల్స్ ప్రకారం.. ఓ వ్యక్తి 6 ఏళ్ల పాటు మాత్రమే వరుసగా పదవిలో కొనసాగే ఛాన్స్ ఉంది. ఇప్పటికే చాలా ఏళ్లుగా బీసీసీఐ కార్యదర్శిగా ఉంటున్నారు. కాబట్టి జై షా తప్పక విరామం తీసుకోవాల్సి ఉంటుంది. ఈ సమయంలో ఐసీసీ ఛైర్మన్‌గా జై షా బాధ్యతలు అందుకుంటే.. 2028లో బీసీసీఐ అధ్యక్ష పదవి అందుకోవడానికి అతనికి లైన్ క్లియర్ అవుతుంది. ఐసీసీ అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తించిన అనుభవం కారణంగా జై షాకు పోటీ కూడా ఉండదనే చెప్పాలి.