Site icon NTV Telugu

KKR: ముస్తాఫిజుర్ ఔట్.. రూ.9.20 కోట్లు కేకేఆర్‌కు తిరిగి ఇస్తారా? ఐపీఎల్ వేలం నిబంధనలు ఏంటి?

Kkr

Kkr

Will KKR Get ₹9.20 Crore Refund?: బీసీసీఐ అకస్మాత్తుగా ముస్తాఫిజుర్ రహ్మాన్‌ను ఐపీఎల్‌ నుంచి తొలగించాలని నిర్ణయం తీసుకుంది. దీంతో 2026 ఐపీఎల్ సీజన్‌కు ముందు కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) భారీ ఎదురుదెబ్బ తగిలింది. డిసెంబర్‌లో జరిగిన వేలంలో చెన్నై సూపర్ కింగ్స్‌తో పోటీ పడిమారీ రూ.9.20 కోట్లకు బంగ్లాదేశ్ ఫాస్ట్ బౌలర్ ముస్తాఫిజుర్‌ను దక్కించుకున్న కేకేఆర్.. చిక్కుల్లో పడింది. ఇప్పుడు ఆ డబ్బు ఫ్రాంచైజీకి తిరిగి ఇస్తారా? లేదా? అనే ప్రశ్న అందరిలో ఉత్పన్నమైంది. సాధారణంగా ఐపీఎల్ వేలం నిబంధనల ప్రకారం.. ఒకసారి ఆటగాడిని కొనుగోలు చేసిన తర్వాత ఆ మొత్తాన్ని ఫ్రాంచైజీకి తిరిగి ఇవ్వరు. ప్లేయర్‌కు గాయం లేదా వ్యక్తిగత కారణాల వల్ల టీం నుంచి బయటకు వెళితే.. నగదు తిరికి ఇవ్వాల్సిన పని లేదు. కానీ.. ముస్తాఫిజుర్ తొలగింపు.. దౌత్య, భద్రతా అంశాలకు సంబంధించిది. బీసీసీఐ స్వయంగా జోక్యం చేసుకుని ఈ నిర్ణయం తీసుకుంది.

READ MORE: Vijayawada Drugs Case: బెజవాడ డ్రగ్స్ కేసులో ట్విస్ట్‌.. బెంగళూరు యువతి ఎంట్రీతో..!

లీగ్ నిర్వహణ మార్గదర్శకాలు చూస్తే.. క్రికెట్‌కు సంబంధం లేని కారణాలతో బీసీసీఐ ఒక ఆటగాడిని జట్టు నుంచి తప్పిస్తే, ఆ ఆటగాడిపై ఖర్చు చేసిన మొత్తం మొత్తాన్ని ఫ్రాంచైజీకి తిరిగి ఇవ్వాల్సిందే. అందువల్ల కేకేఆర్‌కు రూ.9.20 కోట్లు మళ్లీ అందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ అంశాన్ని చట్టపరంగా చూస్తే ఇది ఒక రకమైన “ఫోర్స్ మేజర్”గా భావించవచ్చు. ఈ కేసులో కేకేఆర్‌కు ముస్తాఫిజుర్‌తో చేసిన ఒప్పందాన్ని కొనసాగించాల్సిన బాధ్యత ఉండదు. ఎందుకంటే.. అతడిని ఐపీఎల్ నుంచి తప్పించారు. దీనికి బీసీసీఐ బాధ్యత వహించాల్సి ఉంటుంది. అయితే.. ఒకవేళ ముస్తాఫిజుర్ కేకేఆర్ లేదా బీసీసీఐ నుంచి పరిహారం కోరితే ఏం జరుగుతుందనే ప్రశ్న మరో చర్చను లేవనెత్తింది.

READ MORE: Minister Ponguleti: గత ప్రభుత్వం కమీషన్ల కోణంలోనే ఇళ్లను పంపిణీ చేసింది..

మరోవైపు.. రూ.9.20 కోట్ల రీఫండ్ చాలా కీలకం. ఆ మొత్తాన్ని తిరిగి పొందితేనే కేకేఆర్ రిజిస్టర్డ్ అవైలబుల్ ప్లేయర్ పూల్ (RAPP) లేదా రీప్లేస్‌మెంట్ డ్రాఫ్ట్‌లో ఆర్థికంగా బలోపేతమవుతుంది. ఆ డబ్బు తిరిగి రాకపోతే, తమ తప్పు లేకుండానే కేకేఆర్ నష్టపోయినట్టే.. ముస్తాఫిజుర్ స్థాయి ఆటగాడిని తీసుకోవడం దాదాపు అసాధ్యంగా మారుతుంది. అన్ని సంకేతాల ప్రకారం చూస్తే, కేకేఆర్‌కు కొత్త విదేశీ ఫాస్ట్ బౌలర్ కోసం ఖర్చు చేయడానికి మళ్లీ రూ.9.20 కోట్లు అందే అవకాశమే ఎక్కువ!

Exit mobile version