Site icon NTV Telugu

BCCI: బీసీసీఐలో ఉద్యోగాలు.. ఎవరు అప్లై చేసుకోవచ్చంటే?

Bcci

Bcci

BCCI: భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) వివిధ పోస్టుల కోసం కొత్త నియామకాలను ప్రకటించింది. ఇందులో జాతీయ సెలెక్టర్‌ పోస్టులతో పాటు మహిళా, జూనియర్ సెలెక్షన్ కమిటీల్లో ఖాళీలను భర్తీ చేయనుంది. ఇప్పటికే చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్‌కి ఒక సంవత్సరం కాలపరిమితి పొడిగించి ఆయన కాంట్రాక్ట్ జూన్ 2026 వరకు కొనసాగించగా.. మిగతా సభ్యుల నియామకానికి దరఖాస్తులు కోరుతోంది. ఎంపికైన వారికి BCCI నుంచి లక్షల్లో జీతం అందించనుంది. ఇందుకు సంబంధించి BCCI తన అధికారిక వెబ్‌సైట్‌లో తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో సీనియర్ మెన్స్ టీమ్ కోసం ఇద్దరు నేషనల్ సెలెక్టర్లు, మహిళా జట్టుకు నలుగురు సెలెక్టర్లు, జూనియర్ జట్టుకు ఒక సెలెక్టర్ పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానించింది.

Asia Cup 2025లో టీమిండియా జెర్సీ మారనుందా? ఆ కొత్త బిల్ కారణమా!

ఇక పోస్టులకు సంబంధించి కొన్ని అర్హతలు తప్పనిసరి. అవేంటంటే.. సీనియర్ మెన్స్ టీమ్ కోసం అర్హతలు చూస్తే.. భారత్ తరపున కనీసం 7 టెస్టులు ఆడినవారు లేదా 30 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడినవారు లేదా 10 వన్డేలు, 20 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడిన ఆటగాళ్లు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక మహిళా సెలెక్షన్ కమిటీ సంబంధించి కనీసం 5 సంవత్సరాల క్రితం టీమిండియాలో ఆడిన మాజీ మహిళా ఆటగాళ్లే అర్హులు. అంతేకూండా గత 5 ఏళ్లలో ఎలాంటి క్రికెట్ కమిటీలో సభ్యులుగా ఉండకూడదు. ఇక జూనియర్ సెలెక్షన్ కమిటీ పోస్టుకు కనీసం 25 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడిన మాజీ ఆటగాళ్లే దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే, రిటైర్మెంట్ అయి కనీసం 5 సంవత్సరాలు పూర్తి అయి ఉండాలి. అంతేకూండా గత 5 ఏళ్లలో వారు ఎలాంటి కమిటీలలో భాగం అయి ఉండకూడదు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ సెప్టెంబర్ 10, 2025 సాయంత్రం 5 గంటల వరకు నిర్ణయించారు. తరువాత స్క్రీనింగ్, షార్ట్‌ లిస్టింగ్ ప్రక్రియ పూర్తి చేసి, ఎంపికైన అభ్యర్థులను ఇంటర్వ్యూలకు పిలుస్తారు.

Aarogyasri Scheme: ప్రజలకు బిగ్ అలర్ట్.. ఆగస్ట్ 31 నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బంద్!

Exit mobile version