Site icon NTV Telugu

Gautam Gambhir: ‘టెస్టు’ కోచింగ్‌ మార్పుపై బీసీసీఐ క్లారిటీ..

Gautam Gambhir

Gautam Gambhir

Gautam Gambhir: భారత క్రికెట్‌లో గత కొన్ని రోజులుగా ఒకటే ఆసక్తికరమైన చర్చ నడుస్తుంది. ఇప్పటి వరకు అన్ని ఫార్మాట్లకు హెడ్ కోచ్‌గా ఉన్న గౌతమ్‌ గంభీర్‌ను ఇకపై కేవలం పరిమిత ఓవర్ల క్రికెట్‌కే కోచ్‌గా కొనసాగిస్తారనే వార్తలు తెగ వైరల్ అయ్యాయి. గౌతమ్ గంభీర్ 2024లో భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత.. టీ20, వన్డే ఫార్మాట్లలో టీమిండియా ఆశాజనక విజయాలు సాధించినప్పటికీ.. టెస్టు క్రికెట్‌లో మాత్రం భారత్‌కు నిరాశే మిగిలింది. స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగిన మూడు మ్యాచుల టెస్టు సిరీస్‌లో భారత జట్టు అనూహ్య పరాజయాన్ని చవిచూసింది. ప్రత్యర్థి జట్టు భారత్‌ను 3-0తో క్లీన్ స్వీప్ చేసి.. టీమిండియా టెస్టు క్రికెట్ చరిత్రలోనే వైట్‌వాష్ అపజయాన్ని మూటగట్టుకుంది.

READ ALSO: మీ New Year Resolutions ఏంటి.. వాటిలో ఈ 5 ఉన్నాయా?

దీంతో టెస్టుల్లో కొత్త కోచ్‌ కోసం బీసీసీఐ దృష్టి సారిస్తుందని, వరుస సిరీస్‌ల ఓటములతో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకున్నట్లు, రెండు నెలల తర్వాత టెస్టు కోచ్ విషయంలో మార్పులు చేసే అవకాశం ఉందంటూ కొన్ని వార్తలు వచ్చాయి. ఇదే టైంలో దిగ్గజ బ్యాటర్ వీవీఎస్ లక్ష్మణ్‌ను రెడ్ బాల్ జట్టుకు కోచ్‌గా బాధ్యతలు స్వీకరించాలని బీసీసీఐ కోరినట్లు వార్తలు వైరల్ అయ్యాయి. అయితే తాజాగా బీసీసీఐ అధికారి ఒకరు ఈ వైరల్ న్యూస్‌ను ఖండించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గౌతమ్ గంభీర్‌ను టెస్ట్ కోచ్ పదవి నుంచి మారుస్తారని వస్తోన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని అన్నారు. అవన్నీ వట్టి రూమర్లే అని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు ఈ విషయం గురించి ఎలాంటి చర్చ జరగలేదని, గంభీర్‌తో కాంట్రాక్ట్‌ 2027 వన్డే ప్రపంచ కప్ వరకూ ఉందని, ఆయన కాంట్రాక్ట్‌ ప్రకారం ముందుకు కొనసాగుతాడని వెల్లడించారు. గంభీర్‌పై మాకు నమ్మకముందని, అసలు ఇలాంటి వార్తలు ఎలా వస్తాయో కూడా అర్థం కావడం లేదని అన్నారు. ఇదంతా ఎవరో కల్పించిన రూమర్ అని చెప్పారు. కోచింగ్‌ వ్యవస్థలో ఎలాంటి మార్పులు ఉండవుని ఆయన మరోసారి స్పష్టం చేశారు.

READ ALSO: Sudha Kongara: రజనీకాంత్‌తో ఆ సినిమా తీయాలి: సుధా కొంగర

Exit mobile version