Site icon NTV Telugu

BCCI: బీసీసీఐ క్రికెట్ అడ్వైజరీ కమిటీ భర్తీ… ముగ్గురు మాజీ క్రికెటర్లు ఎవరంటే?

Bcci

Bcci

BCCI: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) గురువారం తన క్రికెట్ సలహా కమిటీని నియమించినట్లు ప్రకటించింది. త్రిసభ్య కమిటీలో అశోక్ మల్హోత్రా, జతిన్ పరాంజపే, శ్రీమతి సులక్షణా నాయక్ ఉన్నారు. అశోక్‌ మల్హోత్రా 7 టెస్టులు, 20 వన్డేల్లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించారు. ఇటీవలే ఇండియన్ క్రికెటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా పనిచేశారు. భారత్ తరఫున 4 వన్డేలు ఆడిన జతిన్ పరాంజపే సీనియర్ పురుషుల సెలక్షన్ కమిటీలో భాగమయ్యాడని అని బీసీసీఐ ఒక ప్రకటనలో తెలిపింది.

Fake iPhones: తక్కువ ధరలకే నకిలీ ఐఫోన్లు.. విక్రయిస్తున్న ముఠా గుట్టురట్టు

11 ఏళ్ల కెరీర్‌లో భారత్ తరఫున రెండు టెస్టులు, 46 వన్డేలు, 31 టీ20లు ఆడిన సులక్షణ నాయక్, ముగ్గురు సభ్యుల బీసీసీఐ క్రికెట్ సలహా కమిటీలో భాగంగా కొనసాగుతున్నారు. కొత్త సెలక్షన్ ప్యానెల్‌పై కమిటీ నిర్ణయం తీసుకోనుంది. గతంలో జాతీయ సెలెక్టర్ల నియామక ప్రక్రియను పర్యవేక్షించే క్రికెట్ సలహా కమిటీ (CAC) ఏర్పడుతుందని బీసీసీఐ సెక్రటరీ జే షా తెలిపారు. ఒక సంవత్సరం తర్వాత సీఏసీ అభ్యర్థులను సమీక్షిస్తుందని, వారి పనితీరుపై బోర్డుకు అభిప్రాయాన్ని అందజేస్తుందని షా చెప్పారు.

Exit mobile version