Site icon NTV Telugu

BC Leaders Fight: బీజేపీ ఆఫీస్ లో పొట్టు పొట్టు కొట్టుకున్న బీసీ నేతలు..

Bjp Office

Bjp Office

BC Leaders Fight: హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీసీ సంఘాల ప్రతినిధుల మధ్య తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. బీసీ బంద్‌కు మద్దతు ఇవ్వాలని రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావును కలిసేందుకు ఆర్. కృష్ణయ్యతో కలిసి వచ్చిన బీసీ సంఘాల నేతలు ఈ ఘర్షణకు కారణమయ్యారు. ఈ సందర్భంగా నేతల మధ్య మాటల తగువు పెరిగి, తోపులాట స్థాయికి చేరింది. ఆఫీసులో ప్రెస్ మీట్ పెట్టేందుకు రామచంద్రరావు సమక్షంలో సమావేశమైన బీసీ సంఘం నేతలు గుజ్జ సత్యం, గుజ్జ కృష్ణ మధ్య విభేదాలు ఉధృతమయ్యాయి.

Hamas-Trump: ట్రంప్ హెచ్చరికలు లెక్క చేయని హమాస్.. తాజాగా 8 మంది బహిరంగ కాల్చివేత

అక్కడ జూనియర్ అయ్యి ఉండి ఫోటోలకు ముందుకు ఎలా వస్తావు..? అంటూ ఒకరిపై ఒకరు అరుస్తూ, చివరకు చేతులు చేసుకొనేదాకా వెళ్లారు. ఈ ఘర్షణ రామచంద్రరావు, ఆర్. కృష్ణయ్య సమక్షంలోనే జరగడం గమనార్హం. రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 18న జరగబోయే బీసీ బంద్‌కు మద్దతు ఇవ్వడం ప్రధాన ఉద్దేశ్యంగా బీసీ సంఘాల ప్రతినిధులు బీజేపీ కార్యాలయానికి వచ్చిన సమయంలో నాయకుల మధ్య ఉన్న అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. దీంతో అక్కడ కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

MLA Raja singh: ఇది కిషన్‌రెడ్డి రాజ్యం.. పార్టీలో బీసీలకు చోటు లేదు.. రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు..

Exit mobile version