NTV Telugu Site icon

BC Janardhan Reddy : బీసీలపై జరుగుతున్న దౌర్జన్యాలను తిప్పికొడతాం

Bc Janardhan Reddy

Bc Janardhan Reddy

బీసీలకు అండగా ఉంటామని చెప్పి, అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వం బీసీలను హత్యలు చేస్తూ, అక్రమ కేసులతో వేధింపులకు గురి చేస్తుందని బనగానపల్లె టీడీపీ మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్థన్ రెడ్డి మండిపడ్డారు. కొలిమిగుండ్లలో టీడీపీ బీసీ నాయకుడిని చంపిన వారికి శిక్ష పడేవరకు వదిలేది లేదని హెచ్చరికలు జారీ చేశారు. స్వర్గీయ ఎన్టీఆర్ బీసీలలో రాజకీయ చైతన్యం కల్పిస్తే,..బీసీ కులాల సంక్షేమానికి పాటుపడి, వారికి గుర్తింపు తీసుకువచ్చింది చంద్రబాబు అని అన్నారు. బీసీ కులాల నాయకులకు మంత్రి పదవులు, కార్పొరేషన్ల పదవులను ఇచ్చింది తెలుగుదేశం పార్టీ మాత్రమే అని బీసీ జనార్థన్ రెడ్డి స్పష్టం చేశారు. టీడీపీ హయాంలో బీసీ కార్పొరేషన్లకు నిధులు ఇచ్చి బలోపేతం చేస్తే…బీసీ కార్పొరేషన్లను పూర్విగా నిర్విర్యం చేసిన ఘనత వైకాపా ప్రభుత్వానిది అంటూ ధ్వజమెత్తారు. సిగ్గూ, శరం లేని వైకాపా నాయకులు టీడీపీ ప్రభుత్వంలో ఆదరణ పథకంలో ఇచ్చిన బీసీ కులవృత్లుల వారికి పరికరాలను పంచలేక, గోదాంల్లో మూలన పడేసారంటూ బీసీ జనార్థన్ రెడ్డి మండిపడ్డారు.

కొలిమిగుండ్లలో తమ రాజకీయ ఉనికి కోసం వడ్డెర కులానికి చెందిన బీసీ నాయకుడిని హత్య చేసిన వైకాపా దుండగలకు శిక్షపడేవరకు వదిలేది లేదని హెచ్చరించారు. ప్రతి ఒక్కరం కష్టపడి తెలుగుదేశం పార్టీని గెలిపించాలని, చంద్రబాబును సీఎంగా చేసుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని తెలుగుదేశం నాయకులకు, కార్యకర్తలకు మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్థన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి బనగానపల్లె టీడీపీ బీసీ నాయకులు, సంజామల మండల స్థాయి బీసీ నాయకులు, కార్యకర్తలు, క్లస్టర్ల ఇంచార్జిలు, సంజామల మండల పరిధిలోని గ్రామాల్లోని బీసీ నాయకులు, కార్యకర్తలు, బీసీ అభిమానులు, ప్రజలు వేలాదిగా తరలివచ్చారు. సంజామల మండలంలో జరిగిన జయ‍బో బీసీ కార్యక్రమంలో బీసీలు కదం తొక్కడంతో టీడీపీ క్యాడర్‌లో ఫుల్ జోష్ నెలకొంది. మరో రెండున్నర నెలల్లో జరగనున్న ఎన్నికల్లో బనగానపల్లె గడ్డపై టీడీపీ జెండా ఎగురవేయడం, రాబోయే టీడీపీ ప్రభుత్వంలో బీసీ జనార్థన్ రెడ్డి మంత్రి అవడం ఖాయమని బనగానపల్లె టీడీపీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.