Site icon NTV Telugu

TS Inter Results : బీసీ గురుకుల విద్యార్థుల జయకేతనం

Bc Gurukul School

Bc Gurukul School

ఇంటర్ ఫలితాల్లో బీసీ గురుకుల విద్యార్థుల జయకేతనం ఎగురవేశారు. నేడు విడుదల చేసిన ఇంటర్ ఫలితాల్లో మహాత్మా జ్యోతిబాఫూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించి ర్యాంకులను కైవసం చేసుకున్నారు. ఇంటర్ రెండో సంవత్సర ఫలితాల్లో 93.84 శాతం, మొదటి సంవత్సరం ఫలితాలలో 86.14శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. 950కి పైగా మార్కులు పొందిన విద్యార్థుల సంఖ్య వందకు పైగా ఉంది. ఇంటర్ రెండో సంవత్సరం పరీక్షలు 2755 మంది విద్యార్థులు రాయగా వారిలో 2544 మంది విద్యార్థులు పాస్ అయ్యారు.

మొదటి సంవత్సరం ఫలితాలలో కొత్తగా ప్రారంభించిన ఒకేషనల్ కోర్సులలోనూ విద్యార్థులు తమ సత్తా చాటారు. నాగార్జునసాగర్ లోని గురుకుల కాలేజీ రెండవ, మొదటి సంవత్సరం ఫలితాలలో వందశాతం ఉత్తీర్ణత సాధించింది. మెరుగైన ఫలితాలు సాధించిన విద్యార్థులను, అధ్యాపకులను, సిబ్బందిని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్, ప్రిన్సిపల్ సెక్రెటరీ బుర్రా వెంకటేశం ఐఏఎస్, కార్యదర్శి మల్లయ్య బట్టు అభినందించారు.

 

Exit mobile version