NTV Telugu Site icon

Andhra Pradesh: ప్రతీ జిల్లా కేంద్రంలో బీసీ భవన్‌.. కలెక్టర్లకు ఆదేశాలు..

Ap Govt

Ap Govt

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.. రాష్ట్రంలోని ప్రతి జిల్లా కేంద్రంలో బీసీ భవన్‌లు కట్టాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం.. ఇప్పటికే శ్రీకాకుళం, చిత్తూరు జిల్లాలో భవన నిర్మాణాలు జరిగాయి.. ఇక, అన్ని జిల్లాల్లో బీసీ భవన్లు కట్టాలని ప్రభుత్వం కలెక్టర్లకు ఆదేశాలు వెళ్లాయి.. ఆ భవన నిర్మాణాలకు అవసరమైన భూమి.. ఇతర సదుపాయాలు కల్పించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.. అయితే, 240 కోట్ల రూపాయల నిధులు అవసరం అవుతాయని అంచనా వేసింది ప్రభుత్వం.. ప్రతి జిల్లా కేంద్రంలో నిర్మించే బీసీ భవన్లలో బీసీ సంఘాల సమావేశాలు.. డ్వాక్రా సంఘాల సమావేశాలు.. ఇతర కార్యక్రమాలు నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోందట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. కాగా, బీసీలకు తమ ప్రభుత్వంలో సరైన అవకాశాలు.. సరైన న్యాయం జరగుతుందని కూటమి నేతలు పలు సందర్భాల్లో వెల్లడించారు.. దానికి అనుగుణంగా.. అన్ని జిల్లాల్లో బీసీ భవనాలు నిర్మించాలనే నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది..

Read Also: New Bulletproof Vehicles: వీఐపీల భద్రత కోసం 10 బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు.. హోంశాఖ ఆదేశాలు