Bathyala Changal Rayudu: ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల వేళ టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తుతో ముందుకు సాగుతున్నాయి.. అయితే, కొన్ని స్థానాల్లో పొత్తులు చిచ్చు పెడుతుంటే.. మరికొన్ని స్థానాల్లో అభ్యర్థుల మార్పు, చేర్పులు కూడా అసంతృప్తులకు దారి తీస్తున్నాయి.. ఇక, తాజాగా టీడీపీ ఫైనల్ లిస్ట్ విడుదల చేసిన విషయం విదితమే కాగా.. రాజంపేట అసెంబ్లీ స్థానానికి సుగవాసి సుబ్రహ్మణ్యంను అభ్యర్థిగా ప్రకటించింది టీడీపీ అధిష్టానం.. ఇదే ఇప్పుడు ఆ నియోజకవర్గంలో అసమ్మతి సెగను రాజేసింది.. బత్యాల చెంగల్రాయుడుకు టీడీపీ టికెట్ ఇవ్వకపోవడంపై భగ్గుమంటున్నారు ఆయన అనుచరులు.. ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలోకి దిగేందుకు దిగనున్న బత్యాల చెంగల్రాయుడు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది.
Read Also: CM Yogi : ఆ కారణంగా సీఎం యోగి బులంద్‌షహర్-నోయిడా పర్యటన రద్దు?
శనివారం అర్ధరాత్రి సమావేశమైన చెంగల్రాయుడు అనుచరులు.. ఇండిపెండెంట్ గా పోటీ చేయాలని ఆయనపై ఒత్తిడి పెంచారు.. అయితే, మీ నిర్ణయమే నా నిర్ణయమని తన అనుచరుల సమావేశంలో చెంగల్రాయుడు వెల్లడించారట.. నాలుగేళ్లుగా పార్టీ క్యాడర్ కాపాడుకుంటూ వచ్చిన వారికి ఇచ్చే బహుమానం ఇదేనా..? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.. పార్టీ కోసం పనిచేసే వారికి టీడీపీలో గుర్తింపు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగాలని అనుచరులు ఒత్తిడి.. తెస్తున్నారని.. ఆ దిశగా నా నిర్ణయం ఉంటుందనే సంకేతాలను బత్యాల చెంగల్రాయుడు ఇవ్వడంతో.. ఇప్పుడు రాజంపేట టీడీపీలో అసమ్మతి బయటపడినట్టు అయ్యింది. ఇక, టీడీపీకి రాజీనామా చేశాయలనే నిర్ణయానికి బత్యాల చెంగల్రాయుడు వచ్చినట్టుగా తెలుస్తోంది.