తెలంగాణలో బతుకమ్మ సంబురాలు వైభంగా జరుగుతున్నాయి. పూల వేడుకలో ఆడపడుచులు ఉత్సాహంగా పాల్గొన్నారు. యువతులు, చిన్నారుల ఆటపాటలతో సందడి చేస్తున్నారు. ప్రపంచమంతా పూలతో దేవుడిని పూజిస్తే.. ఆ పూలనే దేవుడిగా పూజించే బతుకమ్మ పండగ రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుగుతుంది. ఈనెల 2న ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమైన బతుకమ్మ సంబరాలు.. చివరి రోజు (నేడు)సద్దుల బతుకమ్మతో ముగుస్తుంది.
Read Also: Ratan tata: రతన్ టాటా అంత్యక్రియలు పూర్తి.. పార్సీ అయినప్పటికీ చివరికిలా..!
హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్ద బతుకమ్మ సంబరాలు ఘనంగా సాగుతున్నాయి. ప్రభుత్వం సద్దుల బతుకమ్మను అధికారికంగా నిర్వహిస్తోంది. ఈ వేడుకల్లో మంత్రి సీతక్క, ప్రముఖులు పాల్గొని మహిళలతో కలిసి ఆడిపాడారు. మరోవైపు.. ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలు విద్యుత్ కాంతులతో అందంగా మెరుస్తుంది. కాస్త.. వర్షంతో ఇబ్బంది పడిన మహిళలు, తొందరగానే ఆగిపోయింది. దీంతో.. బతుకమ్మ సంబరాలు ఎంతో సంతోషంగా సాగుతున్నాయి. వందలాది మంది మహిళలు ‘బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో’ అంటూ ఆడిపాడుతున్నారు.
Read Also: IAS Officers: ఏపీలో కొనసాగించాలని కోరిన తెలంగాణ ఐఏఎస్లకు షాక్..
రాష్ట్రంలోని ప్రతి గ్రామాల్లో సద్దుల బతుకమ్మ శోభ సంతరించుకుంది. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే సద్దుల బతుకమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. 8 రోజులపాటు తీరొక్క పూలతో బతుకమ్మను ఆడి పాడిన మహిళలు.. ఈ రోజు సద్దుల బతుకమ్మను అత్యంత వైభవంగా జరుపుకుంటున్నారు.