Site icon NTV Telugu

Basara IIIT : ఆర్జీయూకేటీ బాసర 6వ స్నాతకోత్సవం.. ముఖ్య అతిథిగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి

Basara

Basara

రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం బాసర ఈనెల 9వ తేదీన స్నాతకోత్సవ కార్యక్రమం హైదరాబాద్‌లోని బ్రహ్మకుమారిస్ ఆడిటోరియంలో ఘనంగా జరగనుందని వైస్ ఛాన్స్‌లర్ ప్రొఫెసర్ వెంకటరమణ తెలిపారు. ఈ సందర్భంగా వైస్ ఛాన్స్‌లర్ ప్రొఫెసర్ వెంకటరమణ మాట్లాడుతూ… ఈ స్నాతకోత్సవానికి ముఖ్యఅతిథిగా విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, గౌరవ అతిథిగా సుబ్రహ్మణ్యం ఐఏఎస్ (రిటైర్డ్) పూర్వ కార్యదర్శి ఉన్నత విద్యాశాఖ ఎం.హెచ్.ఆర్.డి, ప్రత్యేక అతిథులు జయేష్ రంజన్ ఐఏఎస్ ప్రిన్సిపల్ సెక్రెటరీ ఐటీ శాఖ తెలంగాణ రాష్ట్రం, వాకాటి కరుణ ఐఏఎస్ కార్యదర్శి, ఉన్నత విద్యాశాఖ, తెలంగాణ రాష్ట్రం. ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్లు ప్రొఫెసర్ కృష్ణారెడ్డి త్రిబుల్ ఐటీ హైదరాబాద్, రాజకీయ ప్రముఖులు పాల్గొంటారని పేర్కొన్నారు.

Also Read : Komatireddy Venkat Reddy : నిరూపిస్తే ఎంపీ పదవికి రాజీనామా చేస్తా

ముఖ్య అతిథులు గౌరవ అతిధులు ప్రత్యేక అతిధులు రాజకీయ ప్రముఖులు ఈనెల తొమ్మిదో తేదీ ఉదయం 10:30 నిమిషాలకు గచ్చిబౌలి లోని బ్రహ్మకుమారిస్ ఆడిటోరియానికి చేరుకుంటారమని తెలిపారు. వారికి డైరెక్టర్, అధికారులు స్వాగతం పలుకుతారు. తదనంతరం స్నాతకోత్సవ గౌరవ వస్త్రాలను ధరించి వేదికకు చేరుకుంటారు. ప్రార్థన గీతంతో కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆనంతరం వైస్ ఛాన్స్‌లర్ స్నాతకోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుందన్నారు. ఆ తర్వాత విద్యార్థుల చేత స్నాతకోత్సవ ప్రమాణం ( ప్లెడ్జ్) చేయించి బ్రాంచ్ల వారిగా ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు 11 బంగారు పథకాలను మంత్రి సబితా ఇంద్రారెడ్డి చేతుల మీదుగా ప్రదానం చేస్తారన్నారు. తదనంతరం ముఖ్య అతిథి ప్రసంగం ఉంటుందని తెలిపారు. చివరగా ధన్యవాదాలు డైరెక్టర్ తెలపనున్నట్లు పేర్కొన్నారు. అనంతరం జాతీయ గీతంతో ఈ కార్యక్రమం ముగుస్తుంది. ఇప్పటివరకు స్నాతకోత్సవానికి సంబంధించిన పనులన్నీ పూర్తయ్యాయని తెలిపారు. ఈ స్నాతకోత్సవానికి డిగ్రీ పట్టాలు తీసుకునేందుకు వచ్చే విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ప్రజాప్రతినిధులు, పోలీసు సిబ్బంది, అధ్యాపకులు, ఉద్యోగులకు విద్యార్థులకు అన్ని రకాల సదుపాయాలు సమకూర్చామని తెలిపారు.

Also Read : Bypolls Results 2023:త్రిపుర, ఉత్తరాఖండ్‌లో బీజేపీ.. కేరళలో కాంగ్రెస్, బెంగాల్‌లో తృణమూల్ గెలుపు

Exit mobile version