Crime News: రంగారెడ్డి జిల్లా నార్సింగిలో దారుణం చోటుచేసుకుంది. రాజు అనే బార్బర్‌ను అతి కిరాతకంగా గొంతు కోసి హత్య చేశారు కొందరు దుండగులు. హత్య జరిగిన వెంటనే స్థానికులు 100కు ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. హుటాహుటిన ఘటన స్థలానికి పోలీసులు చేరుకున్నారు. మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ కలహాలతోనే హత్య జరిగినట్లు సమాచారం. బంధువులే హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. రాజు స్థానికంగా బార్బర్ షాపు నిర్వహిస్తున్నట్లు తెలిసింది.
Read Also: CM Revanth Reddy : గురుకుల విద్యార్థినికి అండగా సీఎం రేవంత్ రెడ్డి