ఈ ఏడాది మార్చి నెల కూడా మరో రెండు రోజుల్లో కాల గర్భంలో కలిసిపోనున్నది. ప్రతి నెల మాదిరిగానే వచ్చే నెలలో కూడా బ్యాంకు సెలవులున్నాయి. ఆర్‌బిఐ ఆదేశాల మేరకు, ఏప్రిల్ 2026 నెలలో బ్యాంకులు మొత్తం 14 రోజుల పాటు మూసి ఉండనున్నాయి. ఇందులో 2 శనివారాలు, 4 ఆదివారాలు బ్యాంకు సెలవు రోజులుగా ప్రకటించింది. ఖాతాదారులు తమ బ్యాంకింగ్ సంబంధిత కార్యకలాపాలు, ప్రయాణాలు, వ్యక్తిగత లావాదేవీల పనుల గురించి ముందుగానే ఏప్రిల్ 2026 బ్యాంకు సెలవుల జాబితా తెలుసుకోవడం ముఖ్యం. ఏప్రిల్ నెలలో ప్రాంతీయ పండుగలు, ప్రభుత్వ సెలవులు, వారాంతాలు వంటి సెలవులున్నాయి. అయినప్పటికీ, నెట్ బ్యాంకింగ్, యూపీఐ, మొబైల్ బ్యాంకింగ్ వంటి ఆన్‌లైన్ సేవలు సాధారణంగా పనిచేస్తాయి.
Also Read:Anti-Trump Protests: ట్రంప్ విధానాలకు వ్యతిరేకంగా నిరసనలు.. ఛీకొడుతున్న అమెరికా ప్రజలు
ఏప్రిల్ 2026లోని బ్యాంకు సెలవుల పూర్తి జాబితా
ఏప్రిల్ 1: ఆర్థిక సంవత్సర ముగింపు కారణంగా.. దేశంలోని దాదాపు అన్ని బ్యాంకులకు సెలవు.
ఏప్రిల్ 2: మౌండీ థర్స్ డే సందర్భంగా కొచ్చి, తిరువనంతపురంలోని బ్యాంకులకు సెలవు.
ఏప్రిల్ 3: గుడ్ ఫ్రైడే సందర్భంగా.. అగర్తలా, చండీగఢ్, గౌహతి, జైపూర్, జమ్మూ, శ్రీనగర్ మినహా అన్ని రాష్ట్రాలలోని బ్యాంకులకు సెలవు.
ఏప్రిల్ 5: ఆదివారం బ్యాంకులకు సెలవు
ఏప్రిల్ 11: రెండవ శనివారం బ్యాంకులకు సెలవు
ఏప్రిల్ 12: ఆదివారం బ్యాంకులకు సెలవు
ఏప్రిల్ 14: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి, తమిళ నూతన సంవత్సరం, బైసాఖీ వంటి పండుగల సందర్భంగా ఐజ్వాల్, భోపాల్, చండీగఢ్, ఇటానగర్, కోహిమా, న్యూఢిల్లీ, రాయ్‌పూర్, షిల్లాంగ్, సిమ్లా మినహా అన్ని రాష్ట్రాలలోని బ్యాంకులకు సెలవు.
ఏప్రిల్ 15: బెంగాలీ నూతన సంవత్సర దినం (నబబర్ష)/బోహాగ్ బిహు/విషు/హిమాచల్ దినం కారణంగా అగర్తల, గౌహతి, ఇటానగర్, కొచ్చి, కోల్‌కతా, సిమ్లా, తిరువనంతపురంలలో బ్యాంకులకు సెలవు.
ఏప్రిల్ 16: బోహాగ్ బిహు సందర్భంగా గువహటిలో బ్యాంకులకు సెలవు.
ఏప్రిల్ 19: ఆదివారం బ్యాంకులకు సెలవు
ఏప్రిల్ 20: బసవ జయంతి / అక్షయ తృతీయ సందర్భంగా బెంగళూరులోని బ్యాంకులకు సెలవు.
ఏప్రిల్ 21: గరియా పూజ సందర్భంగా అగర్తలా బ్యాంకులకు సెలవు.
ఏప్రిల్ 25: నాల్గవ శనివారం బ్యాంకులకు సెలవు
ఏప్రిల్ 26: ఆదివారం బ్యాంకులకు సెలవు
