Site icon NTV Telugu

Bank Jobs: బ్యాంకులో కొలువుల జాతర.. దరఖాస్తులకు ఒక్కరోజే గడువు..

Bank Jobs Recruitment

Bank Jobs Recruitment

బ్యాంకులో ఉద్యోగం కోసం వెయిట్ చేస్తున్నారా..? అయితే మీకో గుడ్ న్యూస్.. ప్రముఖ ప్రభుత్వ బ్యాంకులో ఉద్యోగాలకు నోటిఫికేషన్ ను విడుదల చేశారు.. ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ లో మొత్తం 1,172 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది.. అయితే, ఈ బ్యాంకు ఒకేసారి రెండు నోటిఫికేషన్ లను విడుదల చేసింది.. ఇందులో మొత్తం ఖాళీల్లో స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ పోస్టులు 136, మరొకటి కాంట్రాక్ట్ ఉద్యోగాల కోసం 1036 పోస్టులను భర్తీ చెయ్యనుంది..

స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ పోస్టులు..

ఇందులో 136 పోస్టులకు ఖాళీలు ఉన్నాయి.. ఇందులో 84 మేనేజర్ పోస్టులు, 46 అసిస్టెంట్ జనరల్ మేనేజర్, 6 డిప్యూటీ జనరల్ మేనేజర్ పోస్టులు ఉన్నాయి. ఈ నియామకాల కు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ జూన్ 1 నుంచి ప్రారంభం కాగా.. దరఖాస్తుల చివరి తేదీ 15 జూన్ అని ప్రకటించారు.. కేవలం రెండు రోజులు మాత్రమే ఉండటం తో చాలా మంది దరఖాస్తూ చేసుకుంటున్నారు.. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా తమ దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాల్సి ఉంటుంది. వేర్వేరు ఉద్యోగాల కు వేర్వేరు విద్యార్హతలను నిర్ణయించారు.. ఈ ఉద్యోగాల గురించి మరింత సమాచారం కొరకు..https://www.idbibank.in/ వెబ్ సైట్ ను సందర్శించాలి..

కాంట్రాక్టు ఉద్యోగాలు:

ఈ విభాగంలో మొత్తం 1036 ఖాళీలు ఉన్నాయి. ఇందుకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ మే 24న ప్రారంభం కాగా. దరఖాస్తు చేసుకోవడానికి జూన్ 7న ఆఖరి తేదీగా నిర్ణయించారు.. గ్రాడ్యూయేషన్ చేసిన వాళ్ళు ఇందుకు అర్హులు.. ఎంపికైన అభ్యర్థులు ఏడాది పాటు ఒప్పంద ప్రాతిపదికన పని చేయాల్సి ఉంటుంది.. ఆ తర్వాత వారి పని తీరు బాగుంటే సర్వేసును పొడిగించనున్నారు.. ఈ ఉద్యోగాల పై ఆసక్తి కలిగిన వాళ్ళు నోటిఫికేషన్ ను చదివి అప్లై చేసుకోగలరు.. రెండు రోజులు మాత్రమే ఉండటంతో అభ్యర్థులు దరఖాస్తులను పంపిస్తున్నారు..

Exit mobile version