NTV Telugu Site icon

Bank Holidays : ఫిబ్రవరి లో బ్యాంకులకు ఎన్ని రోజులు సెలవులు ఉన్నాయో తెలుసా?

Bank Holiday

Bank Holiday

ప్రతి నెల ఏదొక పండగ ఉంటుంది.. లేదా ఏదైనా ముఖ్యమైన రోజు ఉంటుంది.. ఆ రోజుల్లో ప్రభుత్వ కార్యాలయాలకు సెలవులు ఉంటాయో.. అందులో బ్యాంకులు కూడా ఉంటాయి.. రెండో శనివారం, ఆదివారం కాకుండా కొన్ని రోజుల్లో కూడా సెలవులు ఉంటాయి.. అలాగే ఫిబ్రవరి నెలలో కూడా కొన్ని సెలవులు ఉన్నాయి.. తాజాగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫిబ్రవరి నెల బ్యాంకు సెలవుల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాను చూస్తే దేశవ్యాప్తంగా ఏయే రోజులు, ఎక్కడెక్కడ బ్యాంకులకు సెలవులు ఉన్నాయో తెలుసుకోవడం మంచిది..

2024 ఫిబ్రవరి లో బ్యాంకు సెలవులు..

* ఫిబ్రవరి 4వ తేదీన నెలలో ఆదివారం రోజున దేశ వ్యాప్తంగా అన్ని బ్యాంకులకు సెలవు..

* ఇక ఫిబ్రవరి 10వ తేదీన రెండో శనివారం కారణంగా అన్ని బ్యాంకులు పనిచేయవు..

* ఫిబ్రవరి 11వ తేదీన ఆదివారం రోజున దేశంలోని అన్ని బ్యాంకులకు సెలవు.

* ఫిబ్రవరి 14వ తేదీన బసంత్ పంచమి త్రిపుర, ఒరిస్సా, పశ్చిమ బెంగాల్‌లలో బ్యాంకులకు సెలవు ఉంటుంది.

* ఫిబ్రవరి 15వ తేదీన లూయిస్-నాగై-ని సందర్బంగా మణిపూర్‌లో బ్యాంకులకు సెలవు ప్రకటించారు..

* ఫిబ్రవరి 18వ తేదీ ఆదివారం బ్యాంకులకు సెలవు .

* అలాగే ఫిబ్రవరి 19వ తేదీ ఛత్రపతి శివాజీ జయంతి, మహారాష్ట్రలో బ్యాంకులకు సెలవు ఉంటుంది.

* ఫిబ్రవరి 20వ తేదీన రాష్ట్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మిజోరం, అరుణాచల్ ప్రదేశ్‌లలో బ్యాంకులు పనిచేయవు..

* ఫిబ్రవరి 24వ తేదీన శనివారం సెలవు ఉంటుంది.

* ఫిబ్రవరి 25వ తేదీ ఆదివారం రోజున బ్యాంకులు పనిచేయవు..
* ఫిబ్రవరి 26వ తేదీన న్యోకుమ్ కారణంగా అరుణాచల్ ప్రదేశ్‌లో బ్యాంకులకు సెలవు ఉంటుంది..

పైన తెలిపిన రోజుల్లో బ్యాంకులు పనిచెయ్యవు.. ఏదైనా బ్యాంకులలో పనులు ఉంటే ముందు రోజుల్లో పూర్తి చేసుకోండి.. ఆన్ లైన్ బ్యాంకింగ్, డిజిటల్ పేమెంట్స్ పని చేస్తాయి.. ఇబ్బంది పడాల్సిన పని లేదు..