Site icon NTV Telugu

Bank Holidays: డిసెంబర్‌లో 18 రోజులు బ్యాంకులు బంద్‌.. పూర్తి జాబితా ఇదే!

Bank Holidays

Bank Holidays

Bank holidays in December 2023: ప్రస్తుతం టెక్నాలజీ ఎంతో పెరిగినా.. కొన్ని పనుల కోసం బ్యాంకులకు తప్పనిసరిగా వెళ్లాల్సి ఉంటుంది. అయితే బ్యాంకుకు వెళ్లేముందు సెలవుల జాబితాను చెక్ చేసుకోకుండా పొతే.. మీ సమయం వృధా అవుతుంది. ఈ నేపథ్యంలోనే కస్టమర్లకు అసౌకర్యం కలగకుండా ఉండేందుకు ప్రతి నెలా భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) సెలవుల జాబితాను విడుదల చేస్తుంది. తాజాగా డిసెంబర్‌ నెలకు సంబంధించిన సెలవుల జాబితాను ఆర్బీఐ విడుదల చేసింది.

2023 డిసెంబర్లో బ్యాంకులకు ఏకంగా 18 రోజులు సెలవులు ఉన్నాయి. ఐదు ఆది వారాలు.. రెండో, నాలుగో శని వారాలతో కలిపి ఈ నెలలో18 రోజులు బ్యాంకులు బంద్ కానున్నాయి. ఇందులో ఆర్బీఐ హాలిడే లిస్టుతో పాటు ప్రాంతీయ సెలవులు కూడా ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో డిసెంబర్ నెలలో బ్యాంకులకు 8 రోజులు సెలవులు ఉన్నాయి. బ్యాంకులకు సెలవులు ఉన్నప్పటికీ.. ఇంటర్నెట్ బ్యాంకింగ్​, మొబైల్ బ్యాంకింగ్, యూపీఐ సర్వీసులు, ఏటీఎం సేవలు మాత్రం అందుబాటులో ఉంటాయన్న విషయం తెలిసిందే.

Also Read: Subbalakshmi Died: సీనియర్‌ నటి సుబ్బలక్ష్మి కన్నుమూత!

డిసెంబర్‌లో బ్యాంక్ సెలవులు (2023 December Bank Holidays List):
డిసెంబర్ 1 : రాష్ట్ర వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఇటానగర్, కోహిమా బ్యాంకులకు సెలవు
డిసెంబర్ 3: ఆదివారం సెలవు
డిసెంబర్ 4: సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ పండుగ కారణంగా పనాజీలో సెలవు
డిసెంబర్ 9: రెండో శనివారం సెలవు
డిసెంబర్ 10: ఆదివారం సెలవు
డిసెంబర్ 12: లాసంగ్/పా టోగాన్ నెంగ్‌మింజా సంగ్మా షిల్లాంగ్‌లో సెలవు
డిసెంబర్ 13, 14: లోసంగ్/ పా తోగన్ కారణంగా గాంగ్‌టక్‌లోని బ్యాంకులకు సెలవు
డిసెంబర్ 17: ఆదివారం సెలవు
డిసెంబర్ 18: యు సో సో థామ్ వర్ధంతి కారణంగా షిల్లాంగ్‌లోని బ్యాంకులకు సెలవు
డిసెంబర్ 19: గోవా విమోచన దినోత్సవంతో పనాజీలో సెలవు
డిసెంబర్ 23: నాలుగో శనివారం
డిసెంబర్ 24: ఆదివారం సెలవు
డిసెంబర్ 25: క్రిస్మస్ కారణంగా దేశవ్యాప్తంగా బ్యాంకులు మూసివేత
డిసెంబర్ 26: ఐజ్వాల్, కొహిమా, షిల్లాంగ్‌లలో క్రిస్మస్ సెలవు
డిసెంబర్ 27: క్రిస్మస్ కారణంగా కోహిమాలోని బ్యాంకులు మూసివేత
డిసెంబర్ 30: యు కియాంగ్ కారణంగా షిల్లాంగ్‌లోని బ్యాంకులకు సెలవు
డిసెంబర్ 31: ఆదివారం సెలవు

Exit mobile version