దేశంలోని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలని సంప్రదించిన అనంతరం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) 2025 సంవత్సరానికి సంబంధించిన బ్యాంకు సెలవుల పూర్తి జాబితాని ప్రతి ఏడాది ప్రారంభంలోనే రూపొందించి విడుదల చేయడంతో పాటు దానిని ఆర్బీఐ అధికారిక వెబ్ సైట్ లో కూడా పొందుపరుస్తూ ఉంటుంది. దీని ప్రకారం.. ఆగస్టు నెలలో బ్యాంకులు మొత్తం 15 రోజుల పాటు మూతపడనున్నాయి. అయితే ఆగస్టు నెల బ్యాంకు హాలిడేస్ జాబితాలో స్థానికంగా జరుపునే పండుగలతో పాటు రెండవ శనివారం, నాలుగో శనివారం, ఆదివారాలు కూడా ఉంటాయి. అలాగే ఈ లిస్ట్ లోని కొన్ని సెలవులు దేశంలోని అన్ని రాష్ట్రాలకి వర్తిస్తుండగా, కొన్ని సెలవులు మాత్రం కొన్ని రాష్ట్రాలకి మాత్రమే వర్తిస్తాయనే విషయాన్ని బ్యాంకు కస్టమర్స్ గమనించాలి.
READ MORE: Ravindra Jadeja: ఓటమి నుంచి డ్రాకు.. టెస్టుల్లో రవీంద్ర జడేజా అరుదైన రికార్డు
ఆగస్టు 3- త్రిపురలో కేర్ పూజ రోజున బ్యాంకులు పనిచేయవు.
ఆగస్టు 8 – టెండోంగ్ లో రమ్ ఫట్ కారణంగా సిక్కిం, ఒడిశాలో బ్యాంకులు బంద్ చేస్తారు.
ఆగస్టు 9 – రక్షా బంధన్ కారణంగా ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, హర్యానా, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌లలో బ్యాంకులకు సెలవు.
ఆగస్టు 13 – దేశభక్తి దినోత్సవం సందర్భంగా మణిపూర్‌లో బ్యాంకులకు మూత.
ఆగస్టు 15 – స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు.
ఆగస్టు 16 – జన్మాష్టమి, పార్సీ నూతన సంవత్సరం కారణంగా గుజరాత్, మహారాష్ట్రలలో మూతపడనున్నాయి.
ఆగస్టు 26 – కర్ణాటక, కేరళలో గణేష్ చతుర్థి సెలవు ఉంటుంది.
ఆగస్టు 27 – గణేష్ చతుర్థి సందర్భంగా ఆంధ్రప్రదేశ్, గోవా, గుజరాత్, మహారాష్ట్ర, పంజాబ్, ఒడిశా, సిక్కిం, తమిళనాడు, తెలంగాణలో సెలవు.
ఆగస్టు 28 – నువాఖై కారణంగా ఒడిశా, పంజాబ్, సిక్కింలలో మూతలు.
ఆగస్టు 9, 23 – రెండవ, నాల్గవ శనివారాలు.
ఆగస్టు 10, 17, 24, 31 తేదీలలో ఆదివారం సెలవు.
READ MORE: Danish Kaneria: ‘‘దేశభక్తి కాదు ప్రచారం’’..భారత క్రికెటర్లపై కనేరియా ఆగ్రహం..
