బంగ్లాదేశ్ చొరబాటుదారులపై భారత్ నిరంతరం కఠినంగా వ్యవహరిస్తోంది. కానీ అక్కడక్కడా చొరబాటు దారులు భయటపడుతూనే ఉన్నారు. తాజాగా పశ్చిమ బెంగాల్‌లోని సిలిగురిలో బంగ్లాదేశ్ చొరబాటుదారుడి ఆచూకీ బయటపడింది. బంగ్లాదేశ్ పౌరుడు భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించడమే కాకుండా విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా విధులు నిర్వర్తిస్తుండటం గమనార్హం. నిందితుడి వద్ద ఓటరు, పాన్, ఆధార్ కార్డులు కూడా ఉన్నాయి.
READ MORE: Cyber Fraud : ఫేస్‌బుక్ మోసం.. 70 ఏళ్ల రిటైర్డ్ ఉద్యోగికి రూ.38 లక్షల చీటింగ్
శాంటో భౌమిక్ అనే బంగ్లాదేశీ చొరబాటు దారుడు నార్త్ బెంగాల్ విశ్వవిద్యాలయంలో మాస్ కమ్యూనికేషన్ గెస్ట్ ఫ్యాకల్టీగా బోధిస్తున్నాడు. శాంటో అక్రమంగా భారత్‌లోకి అడుగుపెట్టాడు. నార్త బెంగాల్ విశ్వవిద్యాలయం పరిసరాల్లో ఓ ఫ్లాట్ కొని స్థిరపడాలని ఆలోచిస్తున్నాడు. ఈ అతడు భారతీయుడు కాదని యూనివర్సిటీకి ఫిర్యాదు అందింది. దీంతో అప్రమత్తమైన విశ్వవిద్యాలయ యంత్రాంగం దర్యాప్తు ప్రారంభించింది. అయితే, ఈ వార్త వెలుగులోకి వచ్చిన తర్వాత, శాంటో విశ్వవిద్యాలయ పరిపాలనకు ఓ ఇమెయిల్ పంపాడు. తాను ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించాడు. బంగ్లాదేశ్‌కు తిరిగి వెళ్తున్నానని విశ్వవిద్యాలయానికి తెలియజేశాడు.
READ MORE: Janhvi kapoor : బ్లాక్ డ్రెస్ లో హొయలు పోతున్న జాన్వీ కపూర్..
ఈ ఘటనపై నార్త్ బెంగాల్ విశ్వవిద్యాలయ జాయింట్ రిజిస్ట్రార్ స్వపన్ రక్షిత్ మాట్లాడుతూ.. “మేము పోలీసులకు సమాచారం అందించాం. శాంటో చట్టవిరుద్ధంగా యూనివర్సిటీలో ఉద్యోగం పొందాడు. అయితే.. వర్సిటీ యాజమాన్యం నోటీసులు జారీ చేసింది. వివరణ ఇవ్వాలని 48 గంటల సమయం ఇచ్చింది. నోటీసు అందిన తర్వాత అతను విశ్వవిద్యాలయానికి తిరిగి రాలేదు. ఉద్యోగానికి రాజీనామా చేసి.. బంగ్లాదేశ్ వెళ్తున్నానని పేర్కొంటూ ఓ ఇమెయిల్ పంపాడు.” అని ఆయన వెల్లడించారు.
