Physical Harrasment : ప్రముఖ విద్యాసంస్థ జేఎన్టీయూ (JNTU)లో గెస్ట్ ఫ్యాకల్టీగా పనిచేస్తున్న ఒక మహిళపై అక్కడే పనిచేస్తున్న ప్రొఫెసర్ లైంగిక దాడికి పాల్పడ్డాడనే ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విద్యాసంస్థలోనే ఉద్యోగ సంబంధాల పేరుతో ప్రారంభమైన వేధింపులు, తర్వాత మానసిక బెదిరింపులు, చివరికి అత్యాచారానికి దారి తీసిన విధానం ఇప్పుడు వెలుగులోకి రావడంతో విద్యార్థులు, సిబ్బంది తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. ఒకే సామాజిక వర్గానికి చెందినవారమని నమ్మకాన్ని పెంచుతూ,…
బంగ్లాదేశ్ చొరబాటుదారులపై భారత్ నిరంతరం కఠినంగా వ్యవహరిస్తోంది. కానీ అక్కడక్కడా చొరబాటు దారులు భయటపడుతూనే ఉన్నారు. తాజాగా పశ్చిమ బెంగాల్‌లోని సిలిగురిలో బంగ్లాదేశ్ చొరబాటుదారుడి ఆచూకీ బయటపడింది. బంగ్లాదేశ్ పౌరుడు భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించడమే కాకుండా విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా విధులు నిర్వర్తిస్తుండటం గమనార్హం. నిందితుడి వద్ద ఓటరు, పాన్, ఆధార్ కార్డులు కూడా ఉన్నాయి.