Site icon NTV Telugu

Fariha Trisna Hattrick: 2022లో అరంగేట్రం.. అప్పుడే రెండు హ్యాట్రిక్‌లు!

Fariha Trisna Hattrick

Fariha Trisna Hattrick

Bangladesh bowler Fariha Trisna picks up hat-trick: బంగ్లాదేశ్‌ మహిళా క్రికెటర్‌ ఫరీహా త్రిస్నా చరిత్ర సృష్టించింది. 2022లో అరంగేట్రం చేసిన త్రిస్నా.. తన కెరీర్‌లో రెండో హ్యాట్రిక్‌ సాధించింది. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా మంగళవారం మిర్పూర్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టీ20లో బంగ్లా బౌలర్ రెండో హ్యాట్రిక్‌ సాధించింది. 2022లో తన టీ20లో అరంగేట్రంలోనే త్రిస్న హ్యాట్రిక్‌ వికెట్లు పడగొట్టింది.

ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌ చివరి ఓవర్లో ఫరీహా త్రిస్నా హ్యాట్రిక్‌ తీసింది. 20వ ఓవర్ చివరి మూడు బంతులకు ఎల్లిస్‌ పెర్రీ, మోలినెక్స్‌, బెత్‌ మూనీలను ఔట్‌ చేసింది. ఈ మ్యాచులో త్రిస్నా తన కోటా నాలుగు ఓవర్లలో 19 పరుగులిచ్చి.. నాలుగు వికెట్లు పడగొట్టింది. ఇందులో ఓ మెయిడిన్‌ ఓవర్‌ కూడా ఉండడం విశేషం. ఈ సంవత్సరం మహిళల క్రికెట్‌లో ఇది ఐదవ హ్యాట్రిక్ కావడం మరో విశేషం. 21 ఏళ్ల త్రిస్నా బంగ్లా తరఫున 5 వన్డేలు, 6 టీ20లు ఆడింది.

Also Read: SRH vs CSK: హైదరాబాద్ అభిమానులకు బ్యాడ్ న్యూస్.. ఎస్‌ఆర్‌హెచ్ మ్యాచ్‌కు ఎంఎస్ ధోనీ దూరం!

ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. గ్రేస్ హారిస్ (47), జార్జియా వేర్‌హామ్ (57) రాణించారు. బంగ్లా బౌలర్లలో ఫరీహా త్రిస్నా 4 వికెట్స్ పడగొట్టగా.. నహీద అక్తర్‌, ఫహీమా ఖాతూన్‌ తలో రెండు వికెట్లు పడగొట్టారు. లక్ష్య ఛేదనలో బంగ్లాదేశ్‌ మహిళలు తడబడ్డారు. 20 ఓవర్లలో 9 వికెట్లకు 103 రన్స్ చేశారు. దిలారా అక్టర్ (27), షోర్నా అక్టర్ (21) పరుగులు చేశారు. ఆసీస్ బౌలర్లు ఆష్లీ గార్డనర్, సోఫీ మోలినెక్స్ తలో మూడు వికెట్స్ పడగొట్టారు.

Exit mobile version