Site icon NTV Telugu

BCCI vs BCB: బంగ్లాదేశ్ పుట్టిందే భారత్ సపోర్టుతో.. బీసీసీఐ లేకుంటే బీసీబీకి ఐసీసీలో గుర్తింపు ఏది?

Bangladesh

Bangladesh

BCCI vs BCB: ప్రపంచ కప్ నుంచి బంగ్లాదేశ్ దాదాపు నిష్క్రమించింది. తాము ఇండియాలో మ్యాచ్‌లు ఆడబోమని, తమ టీం భారత్‌కు రాదని బీసీబీ స్పష్టం చేసింది. బంగ్లాదేశ్‌లో వరుసగా హిందువుల హత్యల నేపథ్యంలో రాజకీయ అనిశ్చితి నెలకొంది. దీంతో 2026 ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) నుంచి ముస్తాఫిజుర్ రెహమాన్‌ను మినహాయించారు. ఈ నిర్ణయం బంగ్లాకు నచ్చలేదు. అంతే కాదు.. ఆ దేశంలో హిందువులు వరుస హత్యల నేపథ్యంలో భారత్‌లో తమకు భద్రత ఉండదనే భావన బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డులో మొదలైంది. దీంతో భద్రతా కారణాలను చూపుతూ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) భారతదేశంలో ప్రపంచ కప్ ఆడటానికి నిరాకరించింది. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC), BCB మధ్య అనేక రౌండ్ల చర్చలు జరిగాయి. బుధవారం (జనవరి 21) ICC సభ్య దేశాల సమావేశం తరువాత, వేదికను మార్చబోమని, మ్యాచ్‌లను భారతదేశంలోనే ఆడవలసి ఉంటుందని BCBకి సమాచారం అందింది. తమ వైఖరిని స్పష్టం చేయడానికి బీసీబీకి 24 గంటల సమయం ఇచ్చింది ఐసీసీ. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు, తన దేశ ప్రభుత్వం, ఆటగాళ్లతో సంప్రదించిన తర్వాత, గురువారం (22) తన వైఖరిని కొనసాగించింది. టీ 20 ప్రపంచ కప్ ఆడాలని కోరుకుంటున్నామని, కానీ భారతదేశంలో ఆడమని స్పష్టం చేసింది. దీంతో భారత్- బంగ్లాదేశ్‌ల మధ్య క్రికెట్ యుద్ధ వాతావరణం మొదలైంది. ఈ సందర్భంగా ఓ కీలక అంశం గురించి చర్చిద్దాం. అసలు భారత్ లేకపోతే బంగ్లాదేశ్ దేశమే లేదు. భారత్ లేకపోతే ఆ దేశ క్రికెట్ బోర్డే లేదు. ఈ అంశాన్ని బంగ్లాదేశీయులు ఎలా మర్చిపోయారు? పాకిస్థాన్ బంగ్లాదేశీయులపై అఘాయిత్యాలు పాల్పడిన క్రమంలో ఇరు దేశాల మధ్య స్వాతంత్రోద్యమం మొదలైంది. ఈ ఉద్యమంలో భారత్ బంగ్లాదేశ్‌కు సహకరించింది. దీంతో బంగ్లాదేశ్ సపరేట్ దేశంగా ఏర్పడింది.

READ MORE: Stock Market Crash: కుప్పకూలిన స్టాక్ మార్కెట్.. ఒక్కరోజే రూ. 6 లక్షల కోట్లు గోవిందా!

పాక్ లేకుండా బంగ్లాదేశ్ ఏది?
1971 మార్చిలో తూర్పు పాకిస్థాన్‌లో బెంగాలీ భాష మాట్లాడే ప్రజలపై పాకిస్థాన్‌ సైన్యం చేసిన అఘాయిత్యాలకు వ్యతిరేకంగా స్వాతంత్ర్య ఉద్యమం మొదలైంది. ఆ తర్వాత డిసెంబర్ 3, 1971న భారత్–పాకిస్థాన్‌ మధ్య యుద్ధం ప్రారంభమై, కేవలం రెండు వారాల్లోనే ముగిసింది. డిసెంబర్ 16న తూర్పు పాకిస్థాన్‌ సైన్యాధ్యక్షుడు లెఫ్టినెంట్ జనరల్ ఏఏకే నియాజీ లొంగుబాటు పత్రంపై సంతకం చేయడంతో బంగ్లాదేశ్ జన్మించింది. ఈ యుద్ధంలో భారత్ బంగ్లాదేశ్‌కు అండగా నిలిచింది. భారత సైన్యం ప్రత్యక్షంగా పాకిస్థాన్‌తో యుద్ధం చేసింది. బంగ్లాదేశ్ ఏర్పాటుకు భారత్ ఎంతో సహకరించింది. పాకిస్థాన్‌ దళాల అఘాయిత్యాల నుంచి పారిపోయిన సుమారు రెండు కోట్ల మంది శరణార్థులకు భారత్ ఆహారం, ఆశ్రయం, భద్రత కల్పించింది. ఆ కాలంలో లక్షలాది మంది బెంగాలీలు హతమయ్యారు. వేలాది మహిళలు అత్యాచారాలకు గురయ్యారు. ఈ నేపథ్యంలో బంగ్లాకు అండగా నిలిచింది భారత్. అలాంటి భారత్‌ను బంగ్లాదేశ్ ద్వేషిస్తుండటం ఆదేశానికే సిగ్గు చేటు.

READ MORE: KTR: “సినీ ప్రముఖుల ఫోన్లు ఎవరు ట్యాప్ చేయించారు?”.. కేటీఆర్‌కు సిట్ అడిగిన 11 ప్రశ్నలు ఇవేనా?

ఇదిలా ఉండగా.. 1998లో బంగ్లాదేశ్ కు ఐసీసీలో పూర్తిస్థాయి సభ్యత్వం రాలేదు. ఈ సమయంలోనూ అప్పటికే ఐసీసీలో సభ్యత్వం ఉన్న బీసీసీఐ మరోసారి అండగా నలిచింది. అప్పటి ఐసీసీ అధ్యక్షుడు, బీసీసీఐ చీఫ్ జగ్‌మోహన్ దాల్మియా ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్‌లను బంగ్లాదేశ్‌లో నిర్వహించాలని కీలక నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఢాకాలోని బంగబంధు స్టేడియంలో మ్యాచ్‌లు నిర్వహించారు. ఆ టోర్నీ విజేత దక్షిణాఫ్రికా. కానీ తొలిసారి హోస్ట్‌గా వ్యవహరించిన బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకు మంచి గుర్తింపు లభించింది. 1977లో ఐసీసీ అసోసియేట్ సభ్యుడిగా చేరిన బంగ్లాదేశ్‌కు టెస్టు హోదా కోసం 23 ఏళ్లు పట్టింది. 1999 ప్రపంచ కప్‌లో స్కాట్లాండ్, పాకిస్థాన్‌లను ఓడించి బంగ్లాదేశ్ ఆశ్చర్యపరిచింది. దీంతో టెస్టు హోదాకు వారి వాదన బలపడింది. కానీ నిర్ణయాత్మక సపోర్ట్ భారత క్రికెట్ బోర్డ్ బీసీసీఐ నుంచే వచ్చింది. జగ్‌మోహన్ దాల్మియా సపోర్ట్ తోనే జూన్ 2000లో బంగ్లాదేశ్‌కు టెస్టు హోదా లభించింది. ఈ విషయాన్ని బంగ్లాదేశ్ మాజీ క్రీడాకారులకు బాగా గుర్తుండే ఉంటుంది. ఈ విషయాన్ని మర్చిన నేటి బంగ్లా క్రికెట్ బోర్డు ఇలాంటి చెత్త నిర్ణయాలు తీసుకోవడం గమనార్హం.

Exit mobile version