Bangladesh: “షేక్ హసీనాకు 1,400 సార్లు మరణశిక్ష విధించాలి..” బంగ్లా తాత్కాలిక సర్కార్ డిమాండ్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bangladesh: బంగ్లాదేశ్ మాజీ ప్రధాన మంత్రి షేక్ హసీనాకు మరణశిక్ష విధించాలని మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం గురువారం ఆ దేశ అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్-1లో డిమాండ్ చేసింది. గతేడాది జూలై-ఆగస్టులో జరిగిన ప్రభుత్వ వ్యతిరేక నిరసనల సందర్భంగా 1,400 మంది మరణించారు. ఈ మరణాలను హత్యలుగా అభివర్ణించింది తాత్కాలిక ప్రభుత్వం.. హత్యలకు గాను హసీనాకు “1,400 మరణశిక్షలు” విధించాలని తాత్కాలిక ప్రభుత్వ న్యాయవాది ICT-1లో వాదించారు. గత ఏడాది ఆగస్టు 5న బంగ్లాదేశ్ నుంచి పారిపోవాల్సి వచ్చిన షేక్ హసీనా ప్రస్తుతం భారత్‌లోనే ఉన్న విషయం తెలిసిందే.
READ MORE: Earthquake: ఫిలిప్పీన్స్‌ను వదలని భూకంపాలు.. మరోసారి భారీగా ప్రకంపనలు!
Also Read
- Yogi-Modi Meeting: మోడీ-యోగి భేటీ.. యూపీ ఎన్నికల వేళ కీలక పరిణామం..
- New Bus Stands: ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త.. తెలంగాణలో మరో 13 కొత్త బస్టాండ్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
- TGTET Results 2026: తెలంగాణ ఇన్-సర్వీస్ ఫలితాలు విడుదల.. 70 శాతం దాటిన ఉత్తీర్ణత..!
- Dancers Association Dispute: డాన్సర్స్ అసోసియేషన్‌లో విభేదాలు.. అక్టోబర్ 11న ఎన్నికలు
ఢాకా ట్రిబ్యూన్‌లో ప్రచురితమైన ఒక నివేదిక ప్రకారం.. అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్-1లో బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వానికి ప్రాతినిధ్యం వహిస్తున్న చీఫ్ ప్రాసిక్యూటర్ మొహమ్మద్ తాజుల్ ఇస్లాం తన వాదనను వినిపించారు. విద్యార్థి ఉద్యమ సమయంలో జరిగిన మారణకాండ వెనుక షేక్ హసీనా ప్రధాన సూత్రధారి ఆయన ఆరోపించారు. షేక్ హసీనా నిరసన కారులపై కాల్పులు జరపాలని స్వయంగా ఆదేశాలు జారీ చేసినట్లు పేర్కొన్నారు. ప్రతి హత్యకు వేర్వేరు శిక్షలు విధిస్తే, హసీనాను 1,400 సార్లు ఉరితీయాలి. అది సాధ్యం కాదు కాబట్టి, ఆమెకు కనీసం ఒక మరణశిక్షనైనా విధించాలని డిమాండ్ చేస్తున్నాం, లేకుంటే అది బాధితులకు అన్యాయం అవుతుందని వాదించారు. మాజీ హోం మంత్రి అసదుజ్జమాన్ ఖాన్ కమల్, మాజీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (IGP) చౌదరి అబ్దుల్లా అల్-మామున్లకు సైతం మరణశిక్ష విధించాలని చీఫ్ ప్రాసిక్యూటర్ కోరారు. ఈ ముగ్గురు ముందస్తు ప్రణాళికతో నేరాలకు పాల్పడ్డారని ఆయన ఆరోపించారు.
తాజావార్తలు
-
Yogi-Modi Meeting: మోడీ-యోగి భేటీ.. యూపీ ఎన్నికల వేళ కీలక పరిణామం..
-
New Bus Stands: ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త.. తెలంగాణలో మరో 13 కొత్త బస్టాండ్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
-
Satya Master: “నాలుగు ఎలుకల కోసం మ్యాన్షన్నే తగలబెడతారా?” జానీ మాస్టర్ భార్యపై సత్య మాస్టర్ సంచలన కామెంట్స్!
-
Chiranjeevi: చిరూ లీక్స్ మెగా జోష్.. కాకా షూటింగ్ గురించి మాస్ లీక్ ఇచ్చిన మెగాస్టార్!
-
TGTET Results 2026: తెలంగాణ ఇన్-సర్వీస్ ఫలితాలు విడుదల.. 70 శాతం దాటిన ఉత్తీర్ణత..!
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?