Bangladesh Captain: షకీబ్ అల్ హసన్ బిజీ.. బంగ్లాదేశ్‌కు కొత్త కెప్టెన్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Najmul Hossain Shanto is Bangladesh New Captain: బంగ్లాదేశ్ కొత్త కెప్టెన్‌గా స్టార్ బ్యాటర్ నజ్ముల్ హొస్సేన్ శాంటో ఎంపికయ్యాడు. మూడు ఫార్మాట్లలో శాంటోకు జట్టు పగ్గాలను అప్పగిస్తూ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) సోమవారం నిర్ణయం తీసుకుంది. తదుపరి 12 నెలలు బంగ్లా కెప్టెన్‌గా శాంటో ఉంటాడని బీసీబీ ప్రెసిడెంట్ నజ్ముల్ హసన్ పపోన్ తెలిపారు. ఈ 12 నెలలు శాంటో సారథిగా తానేంటో నిరూపించుకుంటే.. ఆ తరువాత కూడా కొనసాగే అవకాశం ఉంది.
టెస్టు, టీ20ల్లో కెప్టెన్‌గా ఉన్న స్టార్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ రాజకీయాలపై దృష్టి సారించిన విషయం తెలిసిందే. ఇటీవల జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన షకీబ్ రీఎంట్రీపై అనిశ్చతి నెలకొంది. మరోవైపు అతడు కంటి సమస్యతో కూడా బాధపడుతున్నాడు. ఈ క్రమంలో త్వరలో జరగనున్న శ్రీలంక సిరీస్‌కు షకీబ్ దూరమయ్యాడు. సీనియర్ బ్యాటర్ తమీమ్ ఇక్బాల్ తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నా.. అంతర్జాతీయ క్రికెట్ ఆడుతాడో లేదో అన్నది తెలియదు. వన్డే ప్రపంచకప్ 2023కు ముందు వన్డే కెప్టెన్సీ నుంచి తమీమ్ తప్పుకోగా.. షకీబ్ జట్టు పగ్గాలు అందుకున్నాడు. ప్రపంచకప్ అనంతరం షకీబ్ కూడా వన్డే, టీ20 కెప్టెన్సీకి గుడ్‌బై చెప్పి.. టెస్టుల్లో మాత్రమే కొనసాగతానని తెలిపాడు. షకీబ్ ఇప్పటిలో రీ ఎంట్రీ ఇచ్చేలా లేదు. ఈ నేపథ్యంలోనే శాంటోను అన్ని ఫార్మట్లలో కెప్టెన్‌గా బీసీబీ నియమించింది.
Also Read
Also Read: Former Protest Delhi: నేడు రైతుల ‘ఢిల్లీ చలో’ మార్చ్.. సరిహద్దుల్లో బారికేడ్లు, కంచెలు!
నజ్ముల్ హొస్సేన్ శాంటో గతంలో బంగ్లాకు కెప్టెన్‌గా చేశాడు. గతేడాది సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో జట్టుకు సారథ్యం వహించాడు. అతడి నాయకత్వంలోని బంగ్లా సిరీస్‌ను 1-1తో డ్రాగా ముగించింది. అంతకుముందు వన్డే ప్రపంచకప్ 2023లోనూ షకీబ్ గైర్హజరీలో శాంటో జట్టు పగ్గాలు అందుకున్నాడు. శాంటో సారథ్యంలో బంగ్లా 11 మ్యాచ్‌లు ఆడి.. మూడు గెలిచింది. సొంతగడ్డపై మార్చిలో శ్రీలంక సిరీస్‌తో (మూడు టీ20లు, మూడు వన్డేలు) బంగ్లా పూర్తిస్థాయి కెప్టెన్‌గా శాంటో ప్రయాణం ఆరంభంకానుంది. శాంటో బంగ్లా తరపున 25 టెస్టులు, 42 వన్డేలు, 28 టీ20లు ఆడాడు. ఇక కొత్త చీఫ్ సెలెక్టర్‌గా గాజీ అష్రఫ్ హుస్సేన్‌ను బీసీబీ నియమించింది.
తాజావార్తలు
-
Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
-
Shreyas Iyer: చరిత్రను లిఖించనున్న శ్రేయస్ అయ్యర్.. 2028 వరకు కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్..
-
Hyderabad: బంధాల్ని తెంచుతున్న వివాహేతర సంబంధాలు.. తెలుగు రాష్ట్రాల్లో కలకలం
-
NTR Viral Tweet: కుకీలు పంపమన్న అభిమాని.. ఎన్టీఆర్ క్రేజీ రిప్లై ట్వీట్ వైరల్!
-
Natural gas: భారత్‌కు జాక్‌పాట్.. అండమాన్‌లో గ్యాస్ నిల్వలు..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!