Site icon NTV Telugu

Bangladesh: బంగ్లాదేశ్‌లో హిందూ వ్యక్తికి కాల్చి చంపింది వీళ్లే.. అరెస్ట్ చేసిన పోలీసులు

Bangla

Bangla

Bangladesh: బంగ్లాదేశ్‌లోని మైమెన్సింగ్ జిల్లా లింఛింగ్ ఘటనకు సంబంధించి ఏడుగురిని అరెస్ట్ చేసినట్లు దేశ చీఫ్ అడ్వైజర్ మహమ్మద్ యూనస్ శనివారం తెలిపారు. ఈ ఘటనలో మరణించిన వ్యక్తిని 27 ఏళ్ల సనాతన హిందూ యువకుడు దీపు చంద్ర దాస్‌గా యూనస్ ప్రభుత్వం గుర్తించింది. ఎక్స్ (ట్విటర్)లో చేసిన పోస్టులో యూనస్.. “మైమెన్సింగ్‌లోని భలుకా ప్రాంతంలో సనాతన హిందూ యువకుడు దీపు చంద్ర దాస్‌ను కొట్టి చంపిన ఘటనలో ర్యాపిడ్ యాక్షన్ బ్యాటాలియన్ (RAB) ఏడుగురిని అనుమానితులుగా అరెస్ట్ చేసింది” అని పేర్కొన్నారు. అరెస్ట్ అయినవారిలో ఎం.డి. లిమోన్ సర్కార్ (19), ఎం.డి. తారెక్ హొస్సేన్ (19), ఎం.డి. మాణిక్ మియా (20), ఎర్షాద్ అలీ (39), నిజుమ్ ఉద్దిన్ (20), అలొంగీర్ హొస్సేన్ (38), ఎం.డి. మిరాజ్ హొస్సేన్ అకోన్ (46) ఉన్నారని తెలిపారు.

READ MORE: Bihar Hijab Controversy: హిజాబ్ వైద్యురాలికి బంపర్ ఆఫర్.. 3లక్షల జీతం.. కోరుకున్న ఉద్యోగం.. ఎక్కడంటే..!

అయితే.. శుక్రవారం మైమెన్సింగ్‌లో హిందూ యువకుడు దీపు చంద్ర దాస్‌ని దారుణంగా కొట్టి, చెట్టుకు కట్టేసి, కాల్చి చంపారు. చంద్ర దాస్ మహమ్మద్ ప్రవకర్తపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు చంపేసినట్లు బంగ్లా మీడియా వర్గాలు వెల్లడించాయి. ఈ హింసపై బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహ్మద్ యూనస్ నిన్న(శుక్రవారం) స్పందించారు. “మైమెన్సింగ్‌లో ఒక హిందూ వ్యక్తిని కొట్టి చంపిన సంఘటనను మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. న్యూ బంగ్లాదేశ్‌లో ఈ రకమైన హింసకు చోటు లేదు. ఈ క్రూరమైన నేరంలో పాల్గొన్న ఎవరినీ వదలబోం” అని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. కొన్ని తీవ్రవాద గ్రూపులు నిర్వహిస్తున్న హింస పట్ల అప్రమత్తంగా ఉండాలని తాత్కాలిక ప్రభుత్వం ప్రజలను కోరింది. హింస, భయం, దహనం, విధ్వంసం వంటి చర్యలను ఖండిస్తున్నట్లు పేర్కొంది. బంగ్లాదేశ్ కీలకమైన సమయంలో చారిత్రాత్మక ప్రజాస్వామ్య పరివర్తన గుండా వెళ్తోందని, గందరగోళాన్ని సృష్టించే ప్రయత్నాలను సృష్టించి దేశం అశాంతి వైపు ప్రయణించడాన్ని అనుమతించబోమని హెచ్చరించారు.

READ MORE: Actress Amani Joins BJP: బీజేపీ తీర్థం పుచ్చుకున్న నటి ఆమని

Exit mobile version