AUS Vs BAN: బౌలర్ వేసిన బంతి తగలడంతో వాంతి చేసుకున్నాడు.. అయినా సిక్స్ కొట్టి గెలిపించాడు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢాకాలో ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో బంగ్లాదేశ్ జట్టు డక్‌వర్త్ లూయిస్ (DLS) పద్ధతిలో 5 వికెట్ల తేడాతో అద్భుత విజయాన్ని అందుకుంది. ఈ విజయంతో ఆస్ట్రేలియాపై బంగ్లాదేశ్ తొలిసారిగా ద్విపాక్షిక వన్డే సిరీస్‌ను గెలుచుకుని కొత్త చరిత్ర సృష్టించింది. గతంలో 2005లో కార్డిఫ్‌లో ఆస్ట్రేలియాను బంగ్లాదేశ్ తొలిసారి ఓడించగా, మళ్లీ ఇప్పుడు సిరీస్ గెలిచి సరికొత్త రికార్డు నెలకొల్పింది.
కెప్టెన్ మెహిదీ హసన్ మిరాజ్ పోరాటం
బంగ్లాదేశ్ కెప్టెన్ మెహిదీ హసన్ మిరాజ్ ఈ మ్యాచ్‌లో వీరోచిత ఇన్నింగ్స్ ఆడారు. ఇన్నింగ్స్ 34వ ఓవర్లో ఆస్ట్రేలియా బౌలర్ నాథన్ ఎల్లిస్ వేసిన బంతి మిరాజ్ హెల్మెట్‌కు బలంగా తగిలింది. దెబ్బ తీవ్రతకు ఆయనకు మైదానంలోనే వాంతులు అయ్యాయి. ఫిజియోలు మైదానంలోకి వచ్చి చికిత్స అందించారు, స్ట్రెచర్ కూడా సిద్ధం చేశారు. అయినప్పటికీ, మిరాజ్ మైదానాన్ని వీడకుండా పోరాడి, 22 బంతుల్లో 22 పరుగులు చేశారు. 35వ ఓవర్ చివరి బంతికి సిక్స్ కొట్టి జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించారు.
Also Read
- GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
ఆసుపత్రిలో చేరిక..
మ్యాచ్ ముగిసిన తర్వాత కెప్టెన్ మిరాజ్ మైదానం నుంచి నేరుగా ఆసుపత్రికి తీసుకెళ్లారు. బంతి తగలడం వల్ల ఆయన తలకి గాయం అయిందని జట్టు ఫిజియో తెలిపారు. తదుపరి పరీక్షలు, పర్యవేక్షణ కోసం ఆయనను 24 గంటల పాటు ఆసుపత్రిలో ఉంచినట్లు, ప్రస్తుతం ఆయన ప్రమాదం నుంచి బయటపడ్డారని వైద్యులు పేర్కొన్నారు.
తాజావార్తలు
-
GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
-
Russia Mystery Pneumonia: రష్యాలో మిస్టరీ న్యూమోనియా కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి, 197 మందికి క్వారంటైన్
-
Kash Patel Engaged: FBI డైరెక్టర్ కాష్ పటేల్‌కు ఎంగేజ్మెంట్.. ప్రియురాలు అలెక్సిస్ విల్కిన్స్ ఎవరు?
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
Bloody Romeo : రోమియో పక్కన జూలియట్‌గా ప్రీతిముకుందన్?
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!